ఈ రోజు వరుస సభలతో జగన్, బాబు ఎన్నికల ప్రచారం  

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జగన్, చంద్రబాబు. .

Chandrababu And Jagan Poll Campaign In Today-janasena,poll Campaign,tdp,today,ysrcp

ఎన్నికల ప్రచార అంకం చివరి దశకి చేరుకుంటుంది. ప్రధాన పార్టీలు వరుస సభలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ పార్టీలు ఎన్న్నికల ప్రచారంలో చురుకుగా తమ ప్రచారం నిర్వహిస్తున్నాయి..

ఈ రోజు వరుస సభలతో జగన్, బాబు ఎన్నికల ప్రచారం-Chandrababu And Jagan Poll Campaign In Today

అధినేతలు ఒకే రోజు నాలుగు వరుస సభలతో ఎన్నికల ప్రచార జోరు పెంచారు. ఇక ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాలపై ద్రుష్టి పెట్టాడు. ముందుగా కృష్ణా జిల్లా నందిగామలో ప్రచారం పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా నర్సాపురం వెళ్లి ప్రచారంలో పాల్గొంటారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్ లో ఈ రోజు ప్రచారం సభలలో పాల్గొంటారు. ఇక వైసీపీ అధినేత ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలపై ద్రుష్టి పెట్టిన జగన్ ఈ రోజు తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ని కూడా ఆ రకంగానే ప్లాన్ చేసుకున్నారు.

ఇవాళ తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో జగన్‌ ప్రచారంలో పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో, కాకుళం జిల్లా టెక్కలిలో, సాయంత్రం గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.