అదిగో ఇదిగో అన్నారు ... ప్రకటన మాత్రం రాలేదు !     2019-01-11   11:23:48  IST  Sai Mallula

రాజకీయ పార్టీల మధ్య పోరు ఎప్పుడూ .. రసవత్తరంగానే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ ఒకటి చేస్తే … తాము రెండు చేయాలని చూస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో అయితే ఇక ఆ సంగతుల గురించి ఇక చెప్పక్కర్లు. పోటీ పడి మరీ ప్రత్యర్థులకంటే ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఏపీలో రాజకీయ సంగతులు గురించి చర్చిస్తే … ఇక్కడ ప్రధాన పోటీ అంతా వైసీపీ, టీడీపీ , జనసేన మధ్యే ప్రధానంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తెలంగాణాలో కేసీఆర్ అమలుచేసి సక్సెస్ అయిన ఫార్ములానే ఉపయోగించి గట్టెక్కాలని భావించి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ సభ అయిపొయింది… కానీ అభ్యర్థుల ప్రకటన మాత్రం రాలేదు.

Chandrababu And Jagan Not Announced Mla Candidates List-Chandrababu Mla List Tdp Ysrcp Ys

Chandrababu And Jagan Not Announced Mla Candidates List

అయితే ఈ విషయంలో టీడీపీ కూడా వైసీపీని ఫాలో అయినట్టే కనిపించింది. జగన్ ఎక్కడ అభ్యర్థులను ప్రకటించేస్తాడో అనే కంగారులో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనపై తీవ్రంగానే కసరత్తు చేసాడు. జగన్ అభ్యర్థులను ప్రకటించగానే… తాము కూడా ప్రకటించాలని చంద్రబాబు భావించాడు.అయితే అకస్మాత్తుగా ఏమైందో ఏమో కానీ బాబు కూడా ఆ విషయంలో వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. బాబు 120 నియోజక వర్గాలకు చెందిన టిక్కెట్లను.. ముందుగానే ప్రకటించబోతున్నారు అంటూ… టీడీపీ ఆశావహుల్లో పెద్ద హడావుడినే జరిగింది. అయితే ఆ ప్రచారం అంతా….. ఉత్తిదే అని తేలిపోయింది. బాబు ఇప్పుడిప్పుడే ఎలాంటి టిక్కెట్ల ప్రకటనా చేయడం లేదని. టీడీపీ వర్గాలు స్పష్టంగా చెప్పేసాయి. ఒకవైపు జగన్ మరో వైపు బాబు ఇలా ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం వెనుక మారేదన్న కారణాలు ఉన్నాయా అనే విషంపై ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Chandrababu And Jagan Not Announced Mla Candidates List-Chandrababu Mla List Tdp Ysrcp Ys

జగన్ అభ్యర్థులను ప్రకటిస్తారని కారణంగా… బాబు హడావుడిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాడు. ఈ నేపథ్యంలో ….సుమారు 70 నియోజకవర్గాల వరకు సిట్టింగ్ లను ఎంపిక చేస్తున్నప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాలలో వారిని మార్చాల్సిందేనని నిర్ణయానికొచ్చారు. అయితే ఈ విషయంలో వైసీపీ వెనకడుగు వేయడం వెనుక కూడా ఒక పెద్ద రీజన్ ఉందట. టీడీపీలో 30 శాతం మందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని సమాచారం అందడంతో అసంతృప్తిగా ఉన్న వారిని కొన్ని నియోజకవర్గాల్లో తమ వైపుకు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నాడట. అందుకే టీడీపీ అభ్యర్థుల ప్రకటన తరువాతే వైసీపీ అభ్యర్థుల ప్రకటన చేయాలని జగన్ ప్రస్తుతానికి వెనకడుగు వేసాడట. ఈ రెండు ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ…ఈ విధంగా టికెట్ల ప్రకటన ఆలస్యం చేసి మరింత టెన్షన్ పెట్టారు.