దిక్కుతోచ‌క డ‌బుల్ గేమ్‌కు దిగిన చంద్ర‌బాబు...

మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ తో  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు దిక్కుతోస్తున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం అడ్డుకుంటుందని, అడ్డుకోవాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు.

 Chandra Babu Started Double Game, Chandrababu, Zoom App Video Confference, Ap Ca-TeluguStop.com

అయితే  మూడు రాజధానుల అంశంతో తమకేమీ సంబంధం లేదని కేంద్రం తేల్చేయటాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతున్నాడు.దాంతో కేంద్రం తీరుపైన కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

 పార్టీ ఎంపిలతో చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతూ రాజధాని అంశం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలోకి రానపుడు పార్లమెంటు పరిధిలోకే వస్తుందంటూ కొత్త వాదన మొదలుపెట్టాడు.

Telugu @ncbn, Amaravathi, Ap Amaravathi, Chandrababu, Gunture Krishna, Pongure Y

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని అంశంపై మొదటి నుండి కేంద్రం తన వాదనను బలంగానే వినిపిస్తోంది.రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమే అని స్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు వినిపించుకోవటం లేదు.రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నపుడు ఇక పార్లమెంటు పరిధిలోకి మాత్రం ఎలావస్తుందని చంద్రబాబు వాదిస్తున్నాడో అర్ధంకావటం లేదు.

చంద్రబాబు మాటల్లో క్లారిటి లేకపోయినా కేంద్రం అఫిడవిట్లో మాత్రం స్పష్టత బాగానే కనిపిస్తోంది. ఆర్టికల్ 248 ప్రకారం వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ పదే పదే డిమాండ్  చేయటం విచిత్రంగా ఉంది.

నిజానికి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు కూడా అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.అమరావతి అనే రాజధాని చంద్రబాబు నిర్ణయం వల్ల ఏర్పడిందే కానీ పార్లమెంటు ద్వారా ఏర్పడింది కాదు.

అలాగే అమరావతిలో హైకోర్టు కూడా ఇదే విధంగా ఏర్పాటయ్యిందే కానీ పార్లమెంటుకు ఎటువంటి సంబంధం లేదు.అమరావతిని రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని కేంద్రానికి చంద్రబాబు తెలియజేశాడంతే.

తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాజధాని అంశంలో తాను ఆశించినట్లుగా కేంద్రం స్పందించటం లేదన్న అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu @ncbn, Amaravathi, Ap Amaravathi, Chandrababu, Gunture Krishna, Pongure Y

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చరిత్రను తప్పుదోవ పట్టిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.రాజధాని నిర్ణయంపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటిని వేసిందని చెప్పటం తప్పు. శివరామకృష్ణన్ తో కేంద్రం ఎందుకు కమిటి వేసిందంటే రాజధానిగా ఎంపిక చేసుకోవటానికి ఏ ప్రాంతానికి అవకాశం ఉంది ? ఆ ప్రాంతానికున్న  ప్లస్సులేంటి, మైనస్సులేంటి అనే విషయాలపై అధ్యయనం చేయటానికి మాత్రమే.పోని చంద్రబాబు చెప్పిందే నిజమని అనుకున్నా మరి తాను అధికారంలోకి రాగానే పొంగూరు నారాయణతో మరో కమిటి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య అసలు రాజధానిని ఏర్పాటు చేయొద్దని శివరామకృష్ణన్ కమిటి స్పష్టంగా చెప్పినా చంద్రబాబు ఏమి చేశాడు ? అంటే తాను అధికారంలో ఉంటే అంతా తనిష్టం వచ్చినట్లు చంద్రబాబు చేసుకుపోయాడన్నది స్పష్టం అవుతోంది.

విద్యుత్ కొనుగోళ్ళ  విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్నట్లే రైతుల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేయటంలోనే తన అసహనం తెలిసిపోతోంది. విద్యుత్ అంశం అన్నది కేంద్ర-రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నది కాబట్టే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

కానీ రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమే అని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు వినిపించుకోవటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉంటే మాత్రం తన నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు అనుకుంటాడు.

అదే ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం రాష్ట్రప్రభుత్వ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని పదే పదే కోరుకుంటుంటాడు.మొత్తానికి దిక్కుతోచ‌క చంద్ర‌బాబు మ‌రోసారి డ‌బుల్ గేమ్‌కు దిగాడ‌నే అనుకోవాలి.

రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనలపై సిబిఐ విచారణను కోరుతున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఇదే సిబిఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులిచ్చిన విషయం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube