ఏపీలో ఇప్పుడు అదొక్కటే చంద్ర‌బాబు మెయిన్ టార్గెట్‌..!

మూడు రాజధానుల అంశాన్ని వీలైనంతగా సాగదీసి పరిష్కారం కాకుండా చూడటమే తెలుగుదేశంపార్టీ వ్యూహంగా కనబడుతోంది.కేంద్రం హోశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైపోతోంది.భల్లాకు రాసిన లేఖలో  రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, రైతులతో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.2 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాలని, రైతులపై రాష్ట్రప్రభుత్వం యుద్ధం చేస్తోందంటూ అనేక పాయింట్లు ప్రస్తావించింది.రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య సమస్య తలెత్తినపుడు ఆర్టికల్ 248 ప్రయోగించాలని, పార్లమెంటులో ఈ విషయం తేల్చాలంటూ అర్ధంలేని వాదన వినిపించింది.

 Chandra Babu Main Target In Ap, Andhra Pradesh, Ajay Balla Chandra Babu Naidu, A-TeluguStop.com

నిజానికి రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్ర లేదని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది.

దాన్ని చంద్రబాబునాయుడు + మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు.రాజధానుల విషయంలో తన జోక్యం ఉండదని కేంద్రం పదే పదే ప్రకటిస్తున్నా చంద్రబాబు మాత్రం వినటం లేదు.

నిజానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు కూడా చంద్రబాబు కేంద్రం అనుమతి తీసుకోలేదు.అమరావతిని రాజధానిగా చేస్తు పార్లమెంటులో నిర్ణయం జరగలేదు.

కేవలం వ్యక్తిగత స్ధాయిలో నలుగురితో మాట్లాడేసుకుని అమరావతిని రాజధానిగా నిర్ణయించేశారంతే.తర్వాత ఇదే విషయాన్ని కేంద్రప్రభుత్వానికి సమాచారం అందించారు.

దాన్నే కేంద్రం ఆమోదించింది.

తాను అధికారంలో ఉన్నపుడు  ఒకలాగ, ప్రతిపక్షంలోకి రాగానే మరోలాగ వ్యవహరించటం చంద్రబాబుకు బాగా అలవాటే.

తాను అధికారంలో ఉన్నపుడేమో కేంద్రం జోక్యంపై మండిపడిన ఇదే చంద్రబాబు ఇపుడు ప్రతి విషయంలోను కేంద్రం జోక్యాన్ని కోరుతున్నారు.ఇందులో భాగంగానే రాజధానుల విషయంలో పార్లమెంటు జోక్యం చేసుకోవాలని కోరటంలో అర్ధమే లేదు.

ఎందుకంటే కేంద్రం వేరు, పార్లమెంటు వేరుకాదు. కేంద్రం జోక్యం ఉండదంటే పార్లమెంటు జోక్యం కూడా ఉండదనే అర్ధం.పైగా రైతులకు రూ.2 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాలని చెప్పటాన్ని వైసిపి నేతలు తప్పుపడుతున్నారు.రైతులకు పరిహారం అన్నది భూసేకరణ విషయంలో మాత్రమే వర్తిస్తుందని గుర్తుచేస్తున్నారు.అమరావతి ప్రాంతంలో ఎక్కడా భూసేకరణ జరగలేదన్నది వాస్తవం.

Telugu Amaravati, Andhra Pradesh, Chandra Babu-Telugu Political News

చంద్రబాబే స్వయంగా కొన్ని వందలసార్లు చెప్పుంటారు రాజధాని కోసం భూ సమీకరణ జరిగిందని.అందులో కూడా రాజధాని నిర్మాణానికి రైతులు తమంతట తాముగా తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారంటూ రైతులతో  జరిగిన ఒప్పందాల్లో చంద్రబాబు రాయించారని వైసిపి నేతలు చెబుతున్నారు.అంటే భూసేకరణ జరగలేదు కాబట్టి పరిహారం ప్రస్తావనే రాదంటున్నారు.పైగా తాము రాజధానిని ఇక్కడి నుండి తరలించటం లేదని శాసనరాజధానిగా అమరావతే ఉంటుంది కాబట్టి పరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని వైసిపి నేతలు లాజిక్ లేవదీస్తున్నారు.

మూడు ప్రాంతాల్లో మూడు వ్యవస్ధలను ఏర్పాటు చేయటం వల్ల సమయం, డబ్బు వృధా అవుతుందనే బేస్ లెస్ వాదన కూడా టిడిపి మొదలుపెట్టింది.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుల్లో ఎవరికి దేనితో పనుంటే అక్కడికి వాళ్ళు మాత్రమే వెళతారు.

అంతేకానీ మూడూ ఒకేచోటున్నా వేర్వేరుగా ఉన్న జనాలకు ఒకటే.ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో పనున్న శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జనాలు హైదరాబాద్ కు రాలేదా ? అవసరమైతే ఎంత దూరమైనా వెళతారు లేకపోతే వెళ్ళరన్న విషయం అందరికీ తెలుసు.మొత్తం మీద ఏదో ఓ కారణంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని ముందుకు సాగనీయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిపోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube