కోసేప్పుడు రావాల్సిన కన్నీళ్లు, కొంటున్నప్పుడు వస్తున్నాయి

దేశంలో ఉల్లిగడ్డలను కొనలేని పరిస్థితి కనిపిస్తుంది.కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగడ్డ కిలో రెండు వందల నుండి మూడు వందల వరకు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

 Chandrababu About Onion Price-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం ఉల్లిగడ్డల విషయంలో ముందు చూపుతో వ్యవహరించని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.రైతుల నుండి ఉల్లి గడ్డలను తక్కువ దరకు కొనుగోలు చేసి వాటిని ఎగుమతి చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు.

ఒకప్పుడు ఉల్లిగడ్డలను కోస్తూ ఉంటే కన్నీరు వచ్చేది.కాని ఇప్పుడు ఉల్లి గడ్డలను కొనాలంటే కన్నీరు వచ్చే పరిస్థితి వచ్చిందంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నిత్యావసర వస్తువు అయిన ఉల్లి గడ్డ కొండెక్కి కూర్చుంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటీ అంటూ ఈ సందర్బంగా బాబు ప్రశ్నించాడు.వెంటనే ఉల్లి గడ్డల రేటు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఉల్లి రేటు దించకుంటే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube