లోకేష్‌ పెళ్లి అయిన రోజు జరిగిన అనుకోని ఘటన. స్వయంగా చెప్పిన చంద్రబాబు. అదేమిటో తెలుసా..?  

  • రాజకీయ నాయకులు అంటే అంతే అధికారంలో ఉన్నా, లేకపోయినా రోజూ ప్రజల మధ్యే ఉండాల్సి వస్తుంది. వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా పోరాటం చేయాలి. అధికార పక్షంలో ఉంటే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. అలా చేస్తేనే ఏ రాజకీయ నాయకుడికైనా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. సరిగ్గా ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేశారు, ఇప్పుడు ఒంటరి ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ సీఎం అయ్యారు. గతంలో కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలోనూ ఉన్నారు. అయినప్పటికీ తాను ప్రజల మనిషినని నిరూపించుకున్నారు. 26 ఏళ్ల వయస్సులోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాగా అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుందంటే అందుకు కారణం ఆయన ప్రజా దక్షతే. ప్రజల పట్ల ఆయన చూపించే ఆప్యాయతే ఆయన్ను ఇంకా రాజకీయాల్లో నిలబెడుతూ వస్తోంది.

  • Chandrababu About Nara Lokesh Marriage Incident-

    Chandrababu About Nara Lokesh Marriage Incident

  • తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఓ వైపు ప్రతిపక్ష పార్టీ వైకాపా పార్లమెంట్‌లో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తామే స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. అనేక పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు రాజకీయం నడిపారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీలోనూ తాను ప్రజల కోసం చేసిన, చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా గత 40 ఏళ్లుగా ప్రజలకు తాను ఏ రకంగా సేవలందించింది అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అయితే అన్నింటికన్నా మించి ముఖ్యంగా ఆయన లోకేష్‌ పెళ్లి అయినప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. అదేమిటంటే

  • Chandrababu About Nara Lokesh Marriage Incident-
  • అది 2007వ సంవత్సరం ఆగస్ట్ 25వ తేదీ. హైదరాబాద్‌ నగరంలో లుంబనీ పార్క్‌, గోకుల్‌ చాట్‌లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలను కోల్పోయారు. చాలా మంది గాయ పడ్డారు. అయితే తెల్లవారితే తన కుమారుడు లోకేష్‌కు, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో పెళ్లి. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు ఉదయాన్నే వేగంగా పెళ్లి పనులు పూర్తి చేసుకుని తరువాత చకచకా పెళ్లి బట్టలు మార్చుకొని, హడావుడిగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను గమనించి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. అవును మరి, రాజకీయ నాయకులు అన్నాక ముందు ప్రజలనే పట్టించుకోవాలి. కుటుంబాన్ని కచ్చితంగా పక్కన పెట్టేయాల్సిందే.