ఎన్టీఆర్‌ : ఒక బకరా కావాలి!       2018-05-04   00:26:30  IST  Raghu V

తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ తలపెట్టిన ‘ఎన్టీఆర్‌’ చిత్రంకు మొదటి నుండి కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ చిత్రానికి మొదట దర్శకుడిగా పువురి పేర్లను పరిశీలించాడు. ఎంతో మంది ఈ చిత్రానికి నో చెప్పిన తర్వాత చివరకు తేజ వద్దకు వచ్చి బాలయ్య అగాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న తేజ ఈ చిత్రంకు తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకంతో బాలయ్య ఈ చిత్రాన్ని అప్పగించడం జరిగింది. అయితే సినిమా ప్రారంభోత్సవం అయిన తర్వాత తేజ తన వల్ల ఈ సినిమా కాదని, తాను ఈ ప్రాజెక్ట్‌కు న్యాయం చేయలేను అంటూ తేల్చేసి తప్పుకున్నాడు.

తేజ తప్పుకున్నాడా లేదా బాలయ్య తప్పించాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ. ఎన్టీఆర్‌ చిత్రంను పూర్తిగా పాజిటివ్‌గా, తాను అనుకున్న స్క్రిప్ట్‌తో చేసేందుకు బాలయ్య మొత్తం ఇన్వాల్వ్‌ అవుతున్నాడు. అందుకే తేజకు అది నచ్చలేదు. తన నిర్ణయాలకు బాలయ్య విలువ ఇవ్వడనే ఉద్దేశ్యంతో తేజ ఈ చిత్రం నుండి తప్పుకుని ఉంటాడు అంటూ కొందరు చెబుతున్నారు. తేజ తప్పుకున్న నేపథ్యంలో మళ్లీ బాలయ్య దర్శకుల వేట మొదలు పెట్టాడు. చివరకు తానే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎన్టీఆర్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కొన్ని టెక్నికల్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ కారణంగానే తమకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తిని దర్శకుడిగా తీసుకోవాలని బాలయ్య భావిస్తున్నాడు.

అందుకే పలువురు చిన్న పెద్ద, సీనియర్‌ జూనియర్‌ దర్శకులను పరిశీలించడం జరుగుతుంది. తాజాగా ఆ నలుగురు, అందరి బందువయ్య వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చంద్ర సిద్దార్థను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మ్యాటర్‌ ఉన్న దర్శకుడే అయినా కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఈయన తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు.

బాలయ్య చెప్పినట్లుగా, అంతా పాజిటివ్‌గా తెరకెక్కించాలి అంటే ఒక బకరా దర్శకుడు కావాలి. అందుకు ఒప్పుకుని చంద్ర సిద్దార్థ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురిని కూడా బాలయ్య లైన్‌లో పెట్టాడు. చివరికి ఒక దర్శకుడిని ఫైనల్‌ చేసి, తాను అనుకున్న స్క్రిప్ట్‌ను ఆ దర్శకుడి చేతిలో పెట్టి, ఉన్నది ఉన్నట్లుగా, సొంత క్రియేటివిటీని వాడకుండా తెరకెక్కించాలంటూ సూచించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఎంపిక చేసిన దర్శకుల్లో చంద్ర సిద్దార్థపై ఎక్కువ దృష్టి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల చివరి వరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వనుంది. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. అందుకే త్వరలోనే దర్శకుడి ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.

,