జూలై 27 న వచ్చే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే  

  • గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపిస్తే , మరి కొన్ని రాశులకు మంచి చేకూరుస్తుంది. అంతేకాదు ఆకస్మిక ధన లాభం కలిగిస్తుంది. ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం అయితే కొన్ని రాశుల వారిపై ధనవర్షం కురిపిస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు. 2018 జులై 27 శుక్రవారం ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని,గురుపౌర్ణమి అని అంటారు. ఇక అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.

  • ఇక ఈ గ్రహణం రోజున కొన్ని రాశులవారికి అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. అంతేకాదు ఏ పని మొదలుపెట్టినా విజయం వరిస్తుంది. ఉత్తరాషాఢ,శ్రవణ నక్షత్రాలపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. వీళ్ళు శాంతి జరిపించుకోవడం గానీ, తమ తమ ఇష్ట దైవాన్ని ప్రార్ధించడం మంచిది. 27వ తేదీ రాత్ర్రి 11 గంటల 54 నిమిషాలకు మొదలై , తెల్లవారుఝాము 3 గంటల 49 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ముగుస్తుంది.

  • ఉత్తరాషాఢ,శ్రవణ నక్షత్రాల వారు గ్రహణ సందర్బంగా కొన్ని నియమాలు పాటించాలి. నాలుగు గంటల ముందే భోజనం ముగించి,గ్రహణం విడిచాక స్నానం చేయాలి వీలుంటే ఇంట్లో దీపారాధన చేయాలి. భగవన్నామాన్ని ఉచ్చరించాలి. ఆరు మాసాలవరకూ గ్రహణ ప్రభావం ఉంటుంది. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఇక కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. మేషం,సింహం,,వృశ్చిక, మీన రాశుల వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

  • మేషం,సింహం, వృశ్చిక , మీన రాశుల వారికి అనుకూల ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, ఉద్యోగం కోసం చూసేవారికి ఉద్యోగ యోగం కూడా కలుగుతుంది. ఆర్ధిక స్థితి మెరుగవుతుంది. రుణసౌకర్యం కలగడమే కాదు,కొత్త ఉద్యోగాల వేటలో వున్నవారికి కూడా ఫలితం సిద్ధిస్తుంది. అయితే గ్రహణ సమయంలో వీరు ఇష్ట దైవాన్ని ప్రార్ధించాలి.

  • Chandra Grahanam Prediction For Money-

    Chandra Grahanam Prediction For Money

  • ఇక మిగిలిన రాశుల విషయానికి వస్తే, వృషభ రాశి వారు తాము అనుభవించే అనారోగ్యాలు తొలగిపోతాయి. కర్కాటక రాశివారికి మనస్పర్థలు తొలగించబడతాయి. అకారణంగా వచ్చే నిందలనుంచి మిధున రాశివారు బయటపడతారు. కన్యారాశివారికి సంతానోత్పత్తి కలుగుతుంది. ధనస్సు రాశివారు అన్ని రకాల సుఖ సంతోషాలు అనుభవిస్తారు. తులారాశివారికి గృహలాభం కలుగుతుంది.

  • అనారోగ్యాల బారినుంచి బయట పడతారు. కుంభ రాశివారు గతంలో పోగొట్టుకున్న ఆస్తులను పొందుతారు. అయితే అన్ని రాశులవారు గ్రహణ సమయంలో దైవారాధన చేయడం మంచిది. అలాగే దానధర్మాలు చేయడం వలన మంచి ఫలితం పొందుతారు.