బాబు టీం మెంబ‌ర్‌కు సోము టీంలో కీల‌క ప‌ద‌వి.. ఏం జ‌రిగింద‌బ్బా..

తాజాగా ఏపీ బీజేపీకి ప్ర‌త్యేకంగా త‌న‌దైన శైలిలో జ‌ట్టును ఏర్పాటు చేసుకున్న పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు.ప్ర‌తి జిల్లా నుంచి కూడా ప్రాధాన్యం ఉండేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.

 Chandra Babu Team Member Got Chance In Somu Team, Chandra Babu, Jammalamadugu, A-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప నుంచి ముగ్గురికి ప్రాధాన్యం ఇచ్చారు.వీరిలో మాజీ మంత్రి, జ‌మ్మ‌ల‌మ‌డుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి, నాగోతు ర‌మేష్ నాయుడు, శ‌శిభూష‌ణ్ రెడ్డిలు ఉన్నారు.

వీరిలో ఆది నారాయ‌ణ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన నాయ‌కుడు.ఈయ‌న ఎంపిక‌పై పార్టీలోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది.

ఆదినారాయ‌ణ రెడ్డిని ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక చేసిన సోము.నాగోతు ర‌మేష్ నాయుడిని కార్య‌ద‌ర్శిగాను, శ‌శిభూష‌ణ్‌రెడ్డిని బీజేపీ అనుబంధ సంస్థ కిసాన్ మోర్చాలోనూ నియ‌మించుకున్నారు.ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.ఇప్పుడు పార్టీని యాక్టివ్‌గా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఆది వంటివారికి అవ‌కాశం ఇవ్వ‌డంపై పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌తంలోకాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టికీ.త‌ర్వాత వైసీపీలోకి మారిన‌ప్ప‌టికీ.

ఆ త‌ర్వాత టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ.ఆది నారాయ‌ణ‌రెడ్డి త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌నే ప్ర‌దానంగా చూసుకున్నార‌నేది స్థానిక నాయ‌కుల మాట‌.

Telugu Aadi Yana Reddy, Chandra Babu, Jammalamadugu, Somu Veera Raju-Telugu Poli

పైగా.గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత‌.ఆయ‌న బీజేపీ తీర్తం పుచ్చుకున్నారు.సాధార‌ణంగా ఏ నాయ‌కుడైనా.తాను పార్టీ మారాల‌నుకున్న‌ప్పుడు.త‌న కార్య‌క‌ర్త‌ల‌తోనే.

నియోజ‌క‌వ‌ర్గంలో అనుచ‌రుల‌తోనో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటారు.కానీ, ఆది మాత్రం టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకున్నారు.

బాబుకు ఆయ‌న అత్యంత స‌న్నిహితుడు అన్న ముద్ర వేయించుకున్నారు.పైగా బీజేపీలో చేరాక కూడా రాష్ట్ర పార్టీ నేత‌ల‌తో ఆయ‌న అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు.

బీజేపీ నిర్వ‌హించిన ఏ కార్య‌క్ర‌మానికీ ఆయ‌న హాజ‌రు కాలేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికీ ఆయ‌న చంద్ర‌బాబుకు అనుకూల నాయ‌కుడిగానే బీజేపీ నేత‌ల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

కానీ, చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకించే సోము.ఆదికి ఎలా ఛాన్స్ ఇచ్చార‌నేదే ఇప్పుడు వారిని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌.ఇలాంటి నేత‌ల‌తో  ఎలాంటి ప్ర‌యోజ‌నం ఆశించారంటూ.సోమును వారు ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తున్నారు.ఏదేమైనా.కూర్పు బాగున్నా.

నేత‌ల ఎంపిక‌పై మ‌రింత క‌స‌ర‌త్తు చేసి ఉంటే.బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube