పాపం... బాబు పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అర్ధం కావడం లేదు.ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత బాబు పరిస్థితి రోజు రోజుకు మరింత దయనీయంగా మారుతుంది.

 Chandra Babu Situation Is Not Understandable-TeluguStop.com

ఈవీఎం లలో లోపాలు ఉన్నాయి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే దానికి ఎలాంటి తప్పిదం జరగలేదంటూ స్పష్టమైన వివరణ ఇచ్చింది.ఇక సీ ఎం అయిన వై ఎస్ జగన్ అన్నీ ప్రాజెక్ట్ లలో జరిగిన అవినీతిని ప్రజల ముందే బయటపెడతా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇలా ఒక్కొక్క దెబ్బ తగులుతూనే ఉంది.

ఇప్పుడు తాజాగా ఆయన మకాం ఎక్కడ అనేది తేలాల్సి ఉంది.మొన్నటివరకు ఏపీ సీ ఎం గా ఉండడం తో కృష్ణా నది కరకట్ట మీద నిర్మించిన భవనంలో ఉంటున్న బాబు కు ఇప్పుడు సీ ఎం పదవి పోవడం తో అక్కడ ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అది సీ ఎం అధికారిక నివాసం కావడం తో ఇప్పుడు నూతన సి ఎం గా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ కు చెందాలి,కానీ జగన్ మాత్రం తాడేపల్లి లో నే అన్నీ ఏర్పాట్లు చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.దానికి తోడు కరకట్ట వద్ద కట్టిన కట్టడం అనధికారికంగా నిర్మించింది అని గత కొంత కాలంగా వైసీపీ ఆరోపిస్తుంది.

అయితే ఇప్పడు అధికారంలోకీ రావడం తో ఆ కట్టడాన్ని కూల్చివేస్తారా,లేదా మరేదేనికైనా ఉపయోగిస్తారా అన్న దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.దీనితో ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటి అనేది అర్ధం కావడం లేదు.

అమరావతి లో నివాసం లేదు కాబట్టి ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారా,లేదంటే అమరావతి లోనే మరోచోట నివాసం ఏర్పరచుకుంటారా అనేది మాత్రం తెలియలేదు.మరోపక్క ఎన్నికల హడావిడి,రిజల్ట్ ఇలా మొత్తం తీరిక లేకుండా కష్టపడ్డ బాబు కుటుంబం తో కలిసి విదేశాలకు టూర్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నఆయన జూన్ 4న విజయవాడకు రానున్నారు.అక్కడ మూడు రోజుల పాటు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అనంతరం కుటుంబంతో కలిసి జూన్ ఆరో తేదిన విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండనున్న బాబు.తరువాత రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube