రాజీ పడ్డ చంద్రబాబు..ఎందుకంటే     2017-12-13   03:46:20  IST  Bhanu C

పోలవరం విషయం లో జరగవలసిన రాద్దాంతం అంతా జరుగుతూ వస్తోంది.. పనులకి ఎంత ఖర్చు అవుతోంది ఎన్ని నిధులు కేంద్రం నుంచీ వస్తున్న నిధులు ఎన్ని వారి లెక్కలు తీయండి అంటూ ఎప్పటినుంచో ప్రతిపక్ష నేత అడుగుతూనే వస్తున్నారు..ఇదే సమయం లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోలవరం ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కూడా. అసలే కేంద్రం పెడుతున్న ఆంక్షలతో బీపీ మీద ఉన్న బాబు కి పవన్ అడిగిన ప్రశ్నలకి చిర్రెత్తుకొచ్చింది..ఇదే సమయంలో

నన్ను ఎంతమంది ఎన్ని డిమాండ్స్ చేసినా సరే శ్వేతపత్రం విడుదల చేసేది లేదు అని తేల్చేసిన బాబు మానుకు పట్టు పట్టారు..ఎం చేసుకుంటారో చేసుకొండి నేను ఈ విషయం లో రాజీపడను అన్నారు. వైసిపి గైర్హాజరైన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ప్రాజెక్టు లెక్కలు చెప్పామన్నారు. పారదర్శకంగా ఉంటున్నందు వల్ల ప్రత్యేకించి శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయాలని అన్నారు..ఉండవల్లి లాంటి వాళ్ళు కేంద్రానికి చంద్రబాబు తప్పుడు నివేదికలు ఇస్తున్నాడు అంటూ మీడియా ముందు కడిగేశారు కూడా.

అయితే బాబు కి హటాత్తుగా ఏమయ్యిందో ఏమో కానీ పోలవరం తాలూకు లెక్కల చిట్టా ఆన్ లైన్లో ఉంచాలని ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు.కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం చేసిన ఖర్చులు, పునరావాస ప్యాకేజికి పెట్టిన ఖర్చు, ప్రాజెక్టు పురోగతితో సహా అన్నీ వివరాలను ఆన్ లైన్లో ఉంచాలన్నారు..అయితే ఉండవల్లి దెబ్బకే బాబు దిగివచ్చారు అని అంటున్నారు చాలా మంది నేతలు..అందులోనూ ఏపీ ప్రజల్లో పోలవరం విషయంలో బాబు ఎదో గోల్ మాల్ చేస్తున్నాడు అని అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో లెక్కల మీద మాటలు దాట వేస్తున్నాడని అనుకోవడంతో బాబు ఖంగు తిన్నారు..అసలే ఎన్నికల టైం..ఈసమయంలో ప్రజలలో ఏమాత్రం అనుమానాలు వచ్చినా సరే అసలుకే మోసం వస్తుందని గ్రహించి ఈ ఆదేశాలు జారీ చేశారు అని తెలుస్తోంది. మరి ఉండవల్లి ఈ లెక్కల్లో ఎన్ని…వెతుకుతాడో చూడాలి మరి.