పంతం నెరవేరుతోందా ? బాబు ఇల్లు కూలుతోందిగా

ఎట్టకేలకు ఏపీ అధికార పార్టీ వైసిపి తన పంతం నెగ్గించుకున్నట్టుగానే కనిపిస్తోంది.అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే టీడీపీ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలు, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మీద వైసిపి గురిపెట్టింది.

 Chandra Babu Naidus Residencehas Been Demolished-TeluguStop.com

ఇప్పటికే కూల్చివేతలు సంబంధించి అనేకసార్లు నోటీసులు కూడా అందించారు.ఇటీవల కృష్ణా నది వచ్చిన వరదల్లో చంద్రబాబు నివాసం ఉండడం, వైసీపీ వాదనలకు మరింత బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న అక్రమ కట్టడాలను సి ఆర్ డి ఏ పర్యవేక్షణలో సిబ్బంది కూల్చివేతలు మొదలుపెట్టారు.కృష్ణా నది ఇది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం తో పాటు మరికొన్ని అక్రమ కట్టడాలను కూడా సి ఆర్ డి ఏ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలుపెట్టారు.

Telugu Chandra Babu, Chandrababu, Krishna River, Somanytimes-

  మూడు రోజుల క్రితమే నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా బాబు ఉంటున్నఇంటికి నోటీసులు కూడా అంటించారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్ లోని డ్రెస్సింగ్ రూమ్ నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.దీనిపై భవన యజమాని లింగమనేని కూడా స్పందిస్తూ అసలు తాము నిర్మాణం చేపట్టే సమయానికి సీఆర్డీయే లేదని, పంచాయతీ అధికారుల అనుమతి ఇచ్చిన మేరకే భవన నిర్మాణం చేపట్టామని సమాధానం ఇచ్చారు.కానీ ఆ వివరణపై సంతృప్తి చెందని అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు.

అయితే ప్రస్తుతం చంద్రబాబు స్థానికంగా అందుబాటులో లేరు.ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం.

Telugu Chandra Babu, Chandrababu, Krishna River, Somanytimes-

  కరకట్ట పై లింగమనేని గెస్ట్ హౌస్ తో పాటు 31 అక్రమ కట్టడాలు సీఆర్డీఏ అధికారులు గుర్తించి గతంలోనే నోటీసులు కూడా ఇచ్చారు.ఆ తర్వాత వారిని పిలిపించి వారు చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.సుమారు 20 కట్టడాలకు సంబంధించి వాదనలు విని ఐదు కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి నోటీసు జారీ చేశారు.వారం రోజుల్లోగా ఆ కట్టడాలను యజమానులే కూల్చివేయాలని, లేకపోతే సి ఆర్ డి ఏ రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటుందని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం వీటిలో శివ స్వామి ఆశ్రమంలో రెండు కట్టడాలు, ఆక్వా డెవిల్స్ పేరుతో ఒక కట్టడం, మరో మూడు అంతస్తుల భవనాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.అయితే బాబు నివాసం కక్షపూరితంగా కూల్చివేస్తున్న తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

దీనిపై తీవ్రస్థాయిలో వైసీపీ మీద పోరాటం చేయడంతో పాటు, ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube