“ఢిల్లీలో చక్రం తిప్పిన తెలుగు వారిలో మా నాయకుడిదే అగ్రస్థానం“ అని చెప్పుకొన్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఏమీ పాలు పోవడం లేదు.అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలోనూ రాజకీయాలు చేశారు చంద్రబాబు.
అటు కేంద్రంతోనూ సఖ్యతగా మెలుగు తూనే.ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న కేజ్రీవాల్ వంటి వారితోనూ కలిసి మెలిసి రాజకీయాలు సాగించారు.
అయితే, అధికారం పోయిన తర్వాత.మరీ ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఢిల్లీలో చంద్రబాబుకు అసలు పనిలేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు
ఏపీలో వైసీపీ సర్కారుపై పైచేయి సాధించాలనేది చంద్రబాబు ప్రధాన లక్ష్యం.
అయితే, ఇది తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని ఆయన భావన.ఈ క్రమంలో బీజేపీ వంటి బలమైన పార్టీని తన వెంట ఉంచుకుని ఏపీ సర్కారుపై యుద్ధం ప్రకటిస్తే.
మున్ముందు తనకు ఇబ్బంది లేకుండా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని బాబు భావిస్తున్నారు.అయితే, ఒక సారి విడిపోయిన తర్వాత తిరిగి.
టీడీపీతో కలిసి ముందుకు సాగేందుకు బీజేపీ సిద్ధంగా లేదనే అంటున్నారు కమల నాథులు
అయినప్పటికీ.చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం కోలుకోవాలంటూ.ట్వీట్ చేశారు.
అంతేకాదు, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు సైతం తెలిపారు.దీంతో ఎంతో కొంత ఢిల్లీలో తాను వేలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని అనుకున్నారు.
కానీ, ఇది ఎక్కడా ఫలించలేదు
మరోవైపు జనసేన-బీజేపీల బంధం గట్టిపడడం, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటిస్తుండడం.అధికారంలోకి కూడా వస్తామని చెబుతుండడం వంటివి కూడా బాబుకు కలవరపాటుగా ఉంది.
ఈ నేపథ్యంలో ఏదో ఒకరకంగా ఢిల్లీలో అయినా మేనేజ్ చేసుకుని బీజేపీతో కలిసి ముందుకు సాగాలని అనుకుంటున్నా.ఆ ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.