బాబు మరీ ఎక్కువ భయపడుతున్నాడా ?  

Chandra Babu Dharna Against Ceo Office-bjp,chandra Babu,political News,tdp,ysrcp

రాజకీయ పార్టీలన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. నాయకుడనే వాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కుంటూ పార్టీ క్యాడర్లో ధైర్యం నింపాలి. లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకుని చిరునవ్వులు నవ్వుతూ ఎన్నికల్లో మనదే గెలుపు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలి..

బాబు మరీ ఎక్కువ భయపడుతున్నాడా ? -Chandra Babu Dharna Against CEO Office

కానీ ఏపీ అధికార పార్టీ టీడీపీ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రం గా భయపడుతూనే పార్టీ క్యాడర్లో పిరికితనం నూరిపోస్తున్నట్టుగా ఆయన నిన్న మొన్న మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్ధం అవుతోంది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకోసమే అన్నట్టుగా బాబు ఆందోళన చెందుతున్నాడు. అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేస్తే ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు.

బదిలీ చేసిన ఆ అధికారి స్థానంలో అప్పటికప్పుడు ఇంకో అధికారిని కూడా నియమిస్తున్నారు. కొత్త అధికారి ఎవరైతేనేమి విధులు సక్రమంగా నిర్వహిస్తే చాలు కదా. కానీ, చంద్రబాబు మాత్రం అధికారులను బదిలీ చేయవద్దనేలా మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతున్నారు. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా ఆయన ధర్నాకు దిగడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ స్థైర్యం కోల్పోయి ఆందోళనలో పడ్డారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వరుసగా దీక్షలు చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తూ నవ నిర్మాణ దీక్షలు చేశారు. అన్ని జిల్లాల్లో దీక్షలకు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు..

తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పాక ధర్మ పోరాట దీక్షలు అన్ని జిల్లాల్లో నిర్వహించారు

మరికొన్ని గంటల్లో ఎన్నికలు అనగా కూడా ఆయన ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. అయితే, ఇప్పటి వరకు ఏమి చేసినా ఎన్నికల ముందు రోజు ఆయన ధర్నా చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందనే భావన ఉంటే ఇంతకు ముందే ఇంటెలిజెన్స్ డీజీ, సీఎస్, ఎస్పీలను బదిలీ చేసినప్పుడే ఆయన ధర్నాలు చేసి ఉండాల్సింది. అప్పుడు ఆయన ధర్నాకు ఏమైనా ఫలితం కానీ, ఎన్నికల సంఘం నుంచి వివరణ కానీ వచ్చేది.

కానీ, ఎన్నికలకు ఒకరోజు ముందు ధర్నా చేయడం ద్వారా అనవసర గాంధార గోళం తప్ప పెద్దగా సాధించింది ఏమీ కనబడలేదు. అసలు ఎన్నికల సంఘం తీరును బాబు తప్పట్టాలనుకుంటే గతంలో 2009లో చంద్రబాబు ఫిర్యాదు మేకు ఏకంగా డీజీపీనే బదిలీ చేసింది. అంటే అప్పుడు బాబు చేతిలో ఎన్నికల సంఘం ఉందనుకోవాలా ? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ బాబు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది.