కుమారి 21ఎఫ్, దృశ్యం సినిమాలను వదులుకున్న చాందిని చౌదరి.. కారణం ఇదే?

కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు నటీనటులు తమకు వచ్చిన అవకాశాలను ఇష్టం లేకనో లేదా డేట్స్ కుదరక పోవడం వల్లనో వదులుకుంటారు.ఆ సమయంలో వచ్చిన అవకాశాలు అన్ని మంచి మంచి సక్సెస్ లు కూడా అందుకుంటాయి.

 Chandini Chowdhury Missed The Kumari 21f And Drushyam Movie Is This The Reason Chandini Chowdary, Tollywood, Kumari 21f, Drushyam , Colour Photo, Alith Saradaga, Kiran Abbavaram, Sammthama, Chandini Chowdary-TeluguStop.com

కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలే వాళ్ళు వదులుకుంటారు.అలా చాలామంది నటీనటులు ఎన్నో కారణాల వల్ల సినిమాలను వదులుకోగా.

అలా మంచి హిట్ లు అందుకున్న సినిమాలను వదులుకుంది మరో నటి చాందిని చౌదరి.

 Chandini Chowdhury Missed The Kumari 21f And Drushyam Movie Is This The Reason Chandini Chowdary, Tollywood, Kumari 21f, Drushyam , Colour Photo, Alith Saradaga, Kiran Abbavaram, Sammthama, Chandini Chowdary-కుమారి 21ఎఫ్, దృశ్యం సినిమాలను వదులుకున్న చాందిని చౌదరి.. కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాందిని.

ఈ మధ్య మంచి సక్సెస్ అందుకొని మంచి అభిమానం సంపాదించుకుంది.కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించింది.

దాంతో అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో వెండితెరపై అవకాశం అందుకుంది.వెండితెరపై అడుగుపెట్టిన మొదట్లో చాలావరకు అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

తొలిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జి వంటి సినిమాలలో నటించగా తను నటించిన పాత్రలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేనివి.

కానీ 2020 లో విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది.

ఆ సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.ఇక ప్రస్తుతం సమ్మతమే అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.

ఇక ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.ప్రస్తుతం ప్రమోషన్స్ భాగం లో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా వీరిద్దరు ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నారు.ఇక అందులో ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు.

ఎక్కడి నుంచి వచ్చాము అన్న విషయాన్ని.ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యారో అయిన విషయాన్ని పంచుకున్నారు.

ఇక చాందిని కూడా తాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని.చిన్నప్పటి నుంచి చాలా ఆక్టివ్ గా ఉండేదాన్ని అని.నటన పైన బాగా ఆసక్తి ఉండేది అని తెలిపింది.

తాను నటించిన షార్ట్ ఫిలిమ్స్ గురించి కూడా తెలిపింది.ఇక తాను చిన్నప్పుడు ఫ్రెండ్స్ కి దెయ్యాల కథలు చెప్పి బాగా భయపెట్టేదట.ఇక తనకు ఓ ప్రొడ్యూసర్ డేట్స్ తీసుకొని మూడు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారట.

అతను ఒక పెద్ద నిర్మాత అని.రెండు సంవత్సరాలకు అని తనతో ఒక ప్రాజెక్టు సైన్ చేయించుకొని.ఒక్క సన్నివేశం కూడా చేయలేదు అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది.ఆ సమయంలోనే తాను మంచి సినిమాలు వదులుకున్నాను అని తెలిపింది.ఆ సమయంలో తనకు ఊహలు గుసగుసలాడే, కుమారి 21ఎఫ్, పటాస్, దృశ్యం సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.కానీ ఆ నిర్మాతపై ఎదురుతిరిగే ధైర్యం లేక ఆ సినిమాలను వదులుకున్నాను అని తెలిపింది.

అంతేకాకుండా మరికొన్ని విషయాలు కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube