వెబ్ సిరీస్ కోసం శృతి మించిన చాందినీ చౌదరీ!  

Chandini Chowdary Show Her Romantic Angle For Web Series-director Krish,show Her Romantic Angle,tollywood,web Series

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించి తరువాత బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన వైజాగ్ అమ్మాయి చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా పరవాలేదనిపించుకున్న ఈ భామకి టాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

Chandini Chowdary Show Her Romantic Angle For Web Series-Director Krish Show Tollywood Series

పక్కింటి అమ్మాయిల కనిపించే చాందినీ గ్లామర్ పాత్రలకి సెట్ కాదనే అభిప్రాయంతో ఈమెని దర్శకుడు పెద్దగా పరిగణంలోకి తీసుకోలేదు.అలాగే బోల్డ్ పాత్రలు చేయడానికి చాందినీ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.


అయితే ఇప్పుడు ఈ భామ వెబ్ సిరీస్ కోసం మాత్రం కాస్తా శృతి మించింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.క్రిష్ నిర్మాతగా నవదీప్, హేబ్బా పటేల్, బిందు మాధవి స్టార్ కాస్టింగ్ తో మస్తీ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.

ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారం కాబోతుంది.ఇందులో చాందినీ చౌదరి కూడా బార్ లో పనిచేసే అమ్మాయిగా కీలక పాత్రలలో కనిపిస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఈ భామ మొదటి సారి కాస్తా హద్దులు దాటి నటించింది.పెళ్ళైన యువకుడుగా నటించిన నవదీప్ తో ఏకంగా అధర చుంబనాలు కానిచ్చేసింది.

ఈ వెబ్ సిరీస్ లో వీరిద్దరి రొమాన్స్ ఆడియన్స్ ని భాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది.మరి ఈ వైజాగ్ అమ్మాయికి ఈ వెబ్ సిరీస్ ద్వారా తనలో గ్లామర్, రొమాంటిక్ యాంగిల్ లో దర్శకులకి పరిచయం చేసి అవకాశాలు సొంతం చేసుకుంటుదేమో చూడాలి.

తాజా వార్తలు

Chandini Chowdary Show Her Romantic Angle For Web Series-director Krish,show Her Romantic Angle,tollywood,web Series Related....