తెలుగమ్మాయిలను చిన్నచూపు చూడొద్దంటున్న చాందిని..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని పరభాషా హీరోయిన్లనే ప్రోత్సహిస్తారని కొందరు తెలుగు హీరోయిన్లు గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ జాబితాలో కలర్ ఫోటో సినిమాతో హిట్ కొట్టిన చాందిని చౌదరి కూడా చేరారు.

 Chandini Chowdary Interesting Comments About Tollywood Directors And Producers,-TeluguStop.com

చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన బొంబాట్ సినిమా గురువారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చాందిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి, ఇండస్ట్రీలో అవకాశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను సినిమాల్లో ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలని అనుకోవడం లేదని అవకాశాలు వస్తే అన్ని రకాల పాత్రల్లో నటిస్తానని చాందిని తెలిపారు.తాను ఇప్పటివరకు ఎవరితో ప్రేమలో పడలేదని అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని వెల్లడించారు.

Telugu Bombhaat, Color, Directors, Telugu, Tollywood-Movie

కథలు, కవితలు రాయడం తాను ఎంతో ఇష్టపడతానని.స్పోర్ట్స్ చాలా బాగా ఆడతానని చాందిని తెలిపారు.కలర్ ఫోటో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని.ఆహా ఓటీటీలో విడుదలై హిట్ అనిపించుకున్న కలర్ ఫోటో థియేటర్లలో కూడా విడుదలైతే బాగుంటుందని చాందిని అభిప్రాయపడ్డారు.

చాలామంది దర్శక నిర్మాతలు తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు పోషించలేరని అనుకుంటారని.తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు పోషించగలరని అన్నారు.
తాను నిజ జీవితంలో సంప్రదాయబద్ధంగా ఉన్నా మస్తీస్ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా చేశానని చెప్పారు.ఇతర భాషా కథానాయికలతో పోల్చితే తెలుగమ్మాయిలు కూడా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారని దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిల గురించి అపోహలు వీడాలని వ్యాఖ్యలు చేశారు.

బొంబాట్ సినిమాలో చైత్ర అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటించానని సైన్స్ ఫిక్షన్ గా బొంబాట్ తెరకెక్కిందని అన్నారు.ఇంజనీరింగ్ లో మెకానికల్ చేశానని క్లాస్ లో ఒక్కదాన్నే అమ్మాయినని.

క్లాస్ లో అబ్బాయిలు వేరే బ్రాంచ్ అమ్మాయిలను లవ్ చేస్తే సహాయం చేసేదానినని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube