మరో కొత్త సినిమాలో అవకాశం పట్టేసిన చాందినీ చౌదరి  

Chandini Chowdary Got One More Movie Offer, Tollywood, Telugu Cinema, Color Photo, Telugu Heroines - Telugu Chandini Chowdary, Color Photo, Movie Offer, Telugu Cinema, Telugu Heroines, Tollywood

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత కుందనపు బొమ్మ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి చాందినీ చౌదరి.నటిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆరంభంలోనే హోమ్లీ క్యారెక్టర్స్ వేయడంతో అందంగా ఉన్న అవకాశాలు అయితే పెద్దగా రాలేదు.

TeluguStop.com - Chandini Chowdary Got One More Movie Offer

అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలు చేసిన ఏవి కూడా ఆమెకి గుర్తింపు తీసుకురాలేకపోయాయి.అయితే ఒకే ఒక వెబ్ సిరీస్ లో హీరో నవదీప్ తో చేసిన ఘాటు ముద్దు సన్నివేశాలతో చాందినీ చౌదరి గురించి టాలీవుడ్ లో అందరికి తెలిసింది.

నటిగా కూడా ఆమెని దర్శకులు గుర్తించారు.ఇదిలా ఉంటే తాజాగా కలర్ ఫోటో సినిమాతో ఆమె హీరోయిన్ గా కెరియర్ లో మొదటి హిట్ కొట్టింది.

TeluguStop.com - మరో కొత్త సినిమాలో అవకాశం పట్టేసిన చాందినీ చౌదరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా ఆమె నటించింది.సునీల్ విలన్ గా నటించిన ఈ సినిమా ఆహాలో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

నటిగా చాందినీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.దీంతో ఆమె కెరియర్ పుంజుకోవడానికి ఈ సినిమా మంచి వేదిక అయ్యింది.గ్లామర్ పాత్రలు చేయడానికి అయినా తాను సిద్ధమే అని చాందినీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా తెలుగు దర్శకులు కూడా ఆమెపై దృష్టి సారించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోకొత్త సినిమాలో ఈ తెలుగమ్మాయి అవకాశం పట్టేసింది.

రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య అందిస్తున్న కథలో ఈమెని మెయిన్ లీడ్ గా తీసుకున్నారు.కళ్యాణ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandini Chowdary Got One More Movie Offer Related Telugu News,Photos/Pics,Images..