సమ్మతమే రివ్యూ: ఈ సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సమ్మతమే’.ఇక ఈ సినిమాలో నాచురల్ హీరో కిరణ్ అబ్బవరం, నాచురల్ బ్యూటీ చాందినీ చౌదరి నటీనటులుగా నటించారు.కంకణాల ప్రవీణ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా.శేఖర్ చంద్ర సంగీతంను అందించాడు.ఇక సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ రోజు ఈ సినిమా థియేటర్ లలో విడుదల కాగా కిరణ్ అబ్బవరం ఎటువంటి సక్సెస్ అందుకున్నాడో చూడాలి.

 Kiran Abbavaram Sammathame Movie Review And Rating Details, Kiran Abbavaram, Cha-TeluguStop.com

ఇప్పటికే కిరణ్ అబ్బవరం ఎస్పీ కళ్యాణమండపం, సెబాస్టియన్ వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.అదే తరహాలో సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా వారిని ఎలా మెప్పించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో కిరణ్ అబ్బవరం కృష్ణ అనే మధ్యతరగతి కుర్రాడు పాత్రలో నటించాడు.

ఇక కృష్ణ చిన్నతనంలోనే అతని తల్లి చనిపోతుంది.దీంతో అతడు ఇంట్లో ఆడవారు ఉంటే తనని చూసుకుంటే ఇల్లు కూడా బాగుంటుంది అని నమ్మకం.

దీంతో అతడు వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు.ఆ సమయంలోనే అతడికి సాన్వి (చాందిని చౌదరి) ఎదురు పడుతుంది.

ఆమె కృష్ణకు పూర్తి వ్యతిరేకం.అయినప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడతారు.

కానీ వారికి ఒక సమస్య ఎదురవుతుంది.అదేంటంటే కృష్ణ అతి ప్రేమ చూపించటంతో సాన్వికి ఇష్టం తగ్గిపోతుంది.

దాంతో ఇద్దరు గొడవలు జరుగుతుంటాయి.ఇక చివరికి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది, వారు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొంటారు అనేది మిగిలిన కథలోనిది.

Telugu Gopinath Reddy, Kiran Abbavaram, Raview, Sammathame-Movie

నటినటుల నటన:

కిరణ్ అబ్బవరం, చాందిని తమ పాత్రలతో మెప్పించారు.మిగిలిన నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

ఈ సినిమా విషయం లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బాగా ఉంది.ఇక రచన ఇంకా బాగుంటే మంచిగా ఉండేది.

సినిమాటోగ్రఫీ కూడా కాస్త పరవాలేదు అన్నట్లుగా ఉంది.శేఖర్ చంద్ర అందించిన సంగీతం అద్భుతంగా ఉంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది.

విశ్లేషణ:

ఈ సినిమా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సాధారణ కథ అయినా కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.వినోదాత్మకంగా సాగే సన్నివేశాలు, నటీనటుల మధ్య ప్రేమను, ఎమోషనల్స్ ను బాగా చూపించాడు డైరెక్టర్.క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంది.

Telugu Gopinath Reddy, Kiran Abbavaram, Raview, Sammathame-Movie

ప్లస్ పాయింట్స్:

సినిమాటోగ్రఫీ, కథ, సంగీతం, సన్నివేశాలు, నటీనటుల నటన బాగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

కాస్త బలమైన సన్నివేశాలు ఉంటే బాగుండేది.కాస్త స్లోగా అనిపించిన్నట్లు ఉంది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమా యువతకు బాగా ఆకట్టుకుంటుంది.ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు లాగా అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లను, రొమాంటిక్ లను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పిస్తుంది.మొత్తానికి ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/ 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube