స్టార్ హీరోని ప్రేమలో పడేసే పనిలో పడ్డ ట్రాన్స్ జెండర్… కానీ…  

chandigarh kare aashiqui movie shooting update, vani Kapoor, Ayushman Qurana, Bollywood, Movie up;date, chandigarh kare aashiqui, Bollywood new movie updates here - Telugu Ayushman Qurana, Bollywood, Bollywood New Movie Updates Here, Chandigarh Kare Aashiqui, Movie Update, Vani Kapoor

తెలుగులో ప్రముఖ దర్శకుడు గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన “ఆహా కళ్యాణం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ యంగ్ బ్యూటీ వాణి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అమ్మడు వచ్చి రావడంతోనే తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఎందుకో ఎక్కువకాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా  కొనసాగలేక పోయింది.

TeluguStop.com - Chandigarh Kare Aashiqui Movie Shooting Update

కానీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వాణీ కపూర్ వరుస సినీ అవకాశాలతో బాగానే రాణిస్తోంది.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ప్రస్తుతం వాణీ కపూర్ “చండీగర్ కరే ఆశికి” అనే చిత్రంలో నటించడానికి ఇటీవలే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

TeluguStop.com - స్టార్ హీరోని ప్రేమలో పడేసే పనిలో పడ్డ ట్రాన్స్ జెండర్… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

  కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వివరాలను బయటకు తెలియకుండా చిత్ర యూనిట్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు.

అయినప్పటికీ ఈ చిత్రంలో వాణి కపూర్ హీరో ని ప్రేమలో పడేసేటువంటి ట్రాన్స్ జెండర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా వాణి కపూర్ హీరోయిన్ గా నటించిన “బెల్ – బాటం” చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తాత్కాలికంగా మూసివేయడంతో కొంతకాలం పాటు ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.

#Vani Kapoor #Ayushman Qurana #BollywoodNew #ChandigarhKare

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandigarh Kare Aashiqui Movie Shooting Update Related Telugu News,Photos/Pics,Images..