టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు.

ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు.ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు - భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) దంపతులు ప్రార్థించారు.

గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు.రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి.

కృష్ణా, గుంటూరు.

Advertisement
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

Latest Telugu Political News News