తన ప్రియుడు ప్రేమించి మోసం చేశాడని టీవీ సీరియల్ నటి ఆత్మహత్య…  

Chandana Kannada Tv Serial Actress - Telugu Actress Suicide News, Chandana, Dinesh, Kannada Tv Serial Actress, Love Failure, Suicide

ప్రస్తుత కాలంలో కొందరికి ప్రేమ అనేది తమ కోరికలు తీర్చే అవసరమే అయినప్పటికీ మరికొందరికి మాత్రం జీవితం.అలాంటిది ఆ అందమైన జీవితం కోసం కన్న కలలన్నీ కల్లలైన వేళ ప్రియుడు లేదా ప్రియురాలు తీవ్ర మనస్తాపానికి గురై చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

 Chandana Kannada Tv Serial Actress

తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ సీరియల్ నటి తన ప్రియుడి చేతిలో మోసపోయానని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సీరియల్ నటి చందన పలు ధారావాహికలు మరియు పలు రకాల షోలు, ఈవెంట్లలో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

తన ప్రియుడు ప్రేమించి మోసం చేశాడని టీవీ సీరియల్ నటి ఆత్మహత్య…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈమె మరియు దినేష్ అనే వ్యక్తి  గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో తన ప్రియుడిని పూర్తిగా నమ్మిమననటువంటి చందన తన సర్వస్వం అర్పించడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా దినేష్ కి బాగా సహాయపడింది.

అయితే ఇక్కడ వరకూ అంతా బాగానే సాగింది.

కానీ గత కొద్ది రోజులుగా చందన తన ప్రియుడు దినేష్ తనని పెళ్లి చేసుకోవాలని అడుగడంతో దినేష్ మాత్రం ఇతర సాకులు చెబుతూ పెళ్లి ప్రస్తావన దాట వేసేవాడు.

దీంతో తాజాగా పెళ్లి ఈ విషయమై చందన మరియు ఆమె ప్రియుడు మరోసారి గొడవ పడ్డారు.అయితే ఈ గొడవలో దినేష్ చందనను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పినట్లు సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురయినటువంటి నటి చందన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఈ విషయంపై ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని సినీపరిశ్రమకు వచ్చినటువంటి ఓ యువ నటి ఇలా అర్ధాంతరంగా ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు దినేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandana Kannada Tv Serial Actress Related Telugu News,Photos/Pics,Images..

footer-test