విచిత్రం : దర్శకుడిగా ఛాన్స్‌లు లేక హీరోగా మారబోతున్నాడు  

Chances Is A Director Or Hero-

ప్రముఖ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ గత రెండు సంవత్సరాలుగా సినిమాలు ఏమీ చేయలేదు.ఖైదీ నెం.150 చిత్రం తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌తో ఇంటిలిజెంట్‌ అనే చిత్రాన్ని చేశాడు.ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చడంతో ఈయనతో సినిమా అంటేనే హీరోలు, నిర్మాతలు భయపడుతున్నారు.

Chances Is A Director Or Hero--Chances Is A Director Or Hero-

అయినా కూడా పలువురు హీరోలను కలిసి ఎట్టకేలకు రవితేజను ఒప్పించాడంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి.కాని రవితేజతో మూవీ ప్రారంభంకు ముందే వినాయక్‌ ఒక చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు అంటూ కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి.

Chances Is A Director Or Hero--Chances Is A Director Or Hero-

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వినాయక్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక ఈ చిత్రంను అల్లాటప్ప నిర్మాత ఎవరైనా నిర్మిస్తే పెద్దగా పట్టించుకునే అవసరం ఉండేది కాదు, కాని ఈ చిత్రంను ఏకంగా దిల్‌రాజు వంటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

శరభ చిత్ర దర్శకుడు నరసింహారావు దర్శకత్వంలో వినాయక్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులతో పని చేయించిన దర్శకుడు వినాయక్‌ మొదటి సారి ఒక దర్శకుడు చెప్పినట్లుగా నటించేందుకు సిద్దం అయ్యాడు.

చాలా ఏళ్ల క్రితం వినాయక్‌ ‘ఠాగూర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఆ చిత్రంలో చిరంజీవి సూచన మేరకు ఒక పాత్రలో నటించాడు.ఆ సమయంలో వినాయక్‌కు మంచి గుర్తింపు వచ్చింది.అయితే ఆ తర్వాత నటుడిగా కంటిన్యూ అవ్వలేదు.ఇప్పుడు దర్శకుడిగా ఆశించిన స్థాయిలో ఛాన్స్‌ లేని కారణంగా వినాయక్‌ నటిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.