గ్యాస్ కనెక్షన్ కొత్తది తీసుకుంటే రూ.1,600 వచ్చే ఛాన్స్..?!

దేశ ప్రజల శ్రేయస్సు కొరకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికి విదితమే.అందులో కేంద్ర ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలు ఉజ్వల పథకం కూడా ఒకటి.

 Central Government To Give 1600 Rupees For New Gas Connection, Gas Cyclinder, Fr-TeluguStop.com

ఈ పథకం ద్వారా అర్హత గల వారు అందరూ గ్యాస్ కనెక్షన్ ను  తీసుకుంటే 1600 రూపాయలను లబ్ధి చేకూర్చవచ్చు.తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ లో భాగంగా కోటి గ్యాస్ కనెక్షన్లను ఇస్తామని ప్రకటించిన సంగతి అందరికీ విధితమే.

ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్లకు పూర్తి ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ పథకానికి బిపిఎల్ కుటుంబానికి చెందిన మహిళలు ఉజ్వల స్కీం యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ గ్యాస్ కనెక్షన్ కొరకు మనం అప్లికేషన్ ఫామ్ ను ఉజ్వల వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకునే కొరకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు అయి ఉండాలి.

అలాగే బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి.ఈ పథకం ద్వారా 5 కేజీల సిలిండర్ లేదా 14 కేజీల సిలిండర్ ను పొందవచ్చు .ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కచ్చితంగా ఉండాలి.ఈ స్కీం కు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే సమీపంలో ఉండే గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ సంప్రదించి తెలుసుకోవచ్చు.

ఈ పథకం ద్వారా అనేక మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది.

Telugu Budget, Bpl, Lpg, Gas Cyclinder, Gas Stove, Ujjwala Scheme-Latest News -.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube