చామంతి టీ చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?  

Chamomile Tea Beautybenefits -

టీని ఇష్టపడని వారు ఎవరు లేరు.టీలలో కూడా చాలా రకాలు ఉన్నాయి.

 Chamomile Tea Beautybenefits

బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, అల్లం టీ,చామంతి టీ ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నాయి.అయితే వీటిలో ఈ రోజు చామంతి టీ గురించి తెలుసుకుందాం.

చామంతి టీ త్రాగటం వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.ముందుగా చామంతి టీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసి నీటిలో వేసి మరిగించి డికాషన్ తయారుచేయాలి.చామంతి టీ ఉపయోగాలు తెలుసుకుందాం.

చామంతి టీలో వాపు వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన ఎన్నో చర్మ సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.సమస్య ఉన్న ప్రాంతంలో చామంతి టీని రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.చర్మాన్ని శుభ్రపరచి సహజమైన బ్లీచ్ గా, మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

చామంతి టీలో యాంటీసెప్టిక్, వాపు వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన మొటిమలను తగ్గించటమే కాకుండా కొత్తగా మొటిమలు రాకుండా చేస్తుంది.

చామంతి టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుండి కాపాడి కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.

కంటి కింద నల్లటి వలయాలు ఉన్నవారికి చామంతి టీ గొప్ప వరం అని చెప్పవచ్చు.

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు చామంతి టీని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాస్తూ ఉంటె మంచు ఫలితం కనపడుతుంది.ఇలా ఒక వారం పాటు చేస్తే ఆ తేడా చూసి మీరే ఆశ్చర్యపోతారు.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు