కరోనాపై పోరుకు ఎన్ఆర్ఐల ఫండ్ రైజింగ్: భారత్, అమెరికాలకు భారీ సాయం

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది కరోనా వైరస్.దీనిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేయడంతో పాటు అన్ని రకాల ఆంక్షల్ని విధించాయి.అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఈ క్రమంలో ఆయా దేశాలను ఆదుకునేందుకు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు భారీగా విరాళాలను అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికాలో కొంతమంది అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రవాస భారతీయులు బాధితులను ఆదుకునేందుకు, ప్రభుత్వాలకు అండగా నిలిచిందేందుకు రంగంలోకి దిగారు.

 High Profile Indian, Diaspora Group Fund, Covid19 Relief, Indra Nooyi-TeluguStop.com

‘‘చలోగివ్ ఫర్ కోవిడ్-19’’ పేరిట ఫైండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీనికి సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు మంచి స్పందన లభించగా, ఇప్పటి వరకు ఆరు లక్షల డాలర్లను సేకరించారు.ఈ మొత్తాన్ని అమెరికాలోని ‘‘ఫీడింగ్ అమెరికా’’, భారతదేశంలోని ‘‘గూంజ్’’ స్వచ్ఛంద సంస్థల ద్వారా బాధితులకు అందజేయనున్నారు.

Telugu Covid, Diaspora, Profile Indian, Indra Nooyi-

ఈ సందర్భంగా పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి మాట్లాడుతూ.భూమ్మీద ఉన్న ఆహార సంక్షోభాన్ని కరోనా వైరస్ వెలుగులోకి తీసుకొచ్చిందని తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.ఇప్పుడు ప్రజల జీవితాలపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో భారీ ప్రయోజనాల్ని చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా గడిచిని 24 గంటల్లోనే అమెరికాలో దాదాపు 30 వేల కొత్త కేసులు, సుమారు 2 వేల మరణాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో కరోనా సోకిన వాళ్లలో కోలుకున్నది కేవలం 25 వేల మందే, ఇంకా 4 లక్షల 20 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

వీరిలో దాదాపు 10 వేల మంది ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube