నటుడు చంద్రమోహన్‌ కి సైతం ఛాలెంజ్ చేసిన సీన్‌ కేవలం ఇది మాత్రమే .. !

చంద్రమోహన్.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన నటుడు.దాదాపు 600 సినిమాల్లో నటించిన గొప్ప నటుడు.ఎన్నో పాత్రలతో జనాలను ఆయన ఎంతగానో అలరించాడు.అద్భుత నటనతో జనాల మదిలో చెరగని ముద్ర వేశాడు.చంద్రమోహన్ ఎన్నో సినిమాల్లో నటించినా.

 Challenging Scene For Actor Chandra Mohan-TeluguStop.com

ఒక సినిమాలో తను చేసిన ఓ సీన్ ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తాడు ఆయన.ఈ సీన్ లో ఆయన ఎంతో ఇన్వాల్వ్ అయిన చేశాడట.ఆ సినిమా మరేదో కాదు సిరిసిరిమువ్వ.ఇందులోని రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా అనే పాటలో చంద్రమోహన్ జీవించాడని చెప్పుకోవచ్చు.లెజెండరీ దర్శకుడి సారథ్యంలో చంద్రమోహన్ చేసిన నటన అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు.

ఈ పాట గురించి దర్శకుడు విశ్వనాథ్.

 Challenging Scene For Actor Chandra Mohan-నటుడు చంద్రమోహన్‌ కి సైతం ఛాలెంజ్ చేసిన సీన్‌ కేవలం ఇది మాత్రమే .. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్ర మోహన్ కు మందే వివరించాడు.ఈ పాట వచ్చే సన్నివేశాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు.

వేటూరు కష్టపడి రాశాడని.బాలు అద్భుతంగా ఆలపించాడని చెప్పాడు.

మహదేవన్ అద్భుత స్వరకల్పన చేసినట్లు వివరించాడు.ఈ సన్నివేశంలో హీరోలో నిస్సహాయత, ఆగ్రహం, ఆవేదన, తను ఇష్టపడే అమ్మాయికి దేవుడు అన్యాయం చేస్తుంటే తన బాధను అర్థం చేసుకునేవారు లేరా? అనే సందర్భంలో దేవుడిని వేడుకునే పాట.నువ్వేం చెయ్యాలో నేను చెప్ప‌ను.కానీ.

నాకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్ వివరిస్తాను అంటాడు విశ్వనాథ్.ఈ పాత్రలో నటించడం కాదు.

జీవించాలి అంటాడు.

Telugu Challenging Scene For Actor Chandra Mohan, Chandramohan, Mahadevan, Sirisirimuvva, Tollywood, Veturi, Vishwanath-Telugu Stop Exclusive Top Stories

దర్శకుడు విశ్వనాథ్ కోరిక మేరకు చంద్రమోహన్ చాలా కష్టపడతాడు.ఎలాగైనా దర్శకుడు చెప్పిన విధంగా నటించాలి అనుకుంటాడు.ఈ సీన్ లో ప్రాణం పెట్టి నటిస్తాడు.

తన అద్భుత నటనతో ఆ పాటలో లీనమై నటిస్తాడు.ఆ సినిమా పాట ఎన్ని దశాబ్దాలు గడిచినా.

ఇప్పటికీ అందులో ఆయన నటన మర్చిపోలేం.సిరిసిరిమువ్వ సినిమా తర్వాత తను ఎన్నో పాత్రలు చేసినా.

ఎన్నో సినిమాల్లో నటించినా.ఈ పాటలో వచ్చిన తృప్తి మరెక్కడా రాలేదు అంటాడు చంద్రమోహన్.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో వెల్లడించాడు.

#Sirisirimuvva #Chandramohan #Veturi #Mahadevan #Vishwanath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు