ఒక మాస్ ఇమేజ్ వచ్చిన ఏ హీరో కూడా ఒక ఎక్స్ పరిమెంటల్ సినిమా చేసేందుకు సాహసం చేయడు.నటుడిగా తన సత్తా చాటుకోవాలి అనుకున్న వారు మాత్రమే ప్రయోగాలకు రెడీ అవుతారు.
ఇలా చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన హీరోలు కూడా ఉన్నారు.కొందరు హీరోలు మాత్రం తమ ఇమేజీని పక్కన పెట్టి చాలెంజింగ్ రోల్స్ చేశారు.
అందరి చేత ప్రశంసలు పొందారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మమ్ముట్టి- పెరంబుమలయాళంలో మమ్ముట్టి టాప్ హీరో.అలాంటి సూపర్ స్టార్ పెరంబు సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేశాడు.ఈ పాత్రకు తను మాత్రమే సూటవుతాడు అనేలా నటించాడు.అందరి చేత వారెవ్వా అనిపించుకున్నాడు.విక్రమ్- శివ పుత్రుడుశివ పుత్రుడు సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర అప్పట్లో సంచలనం అయ్యింది.అత్యంత డీ గ్లామర్ పాత్రలో అద్భుత నటనను కనబరిచాడు.విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.చిరంజీవి-రుద్రవీణఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆయన బాలచందర్ దర్శకత్వంలో ఓ కులంపై సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.పధ్ ఫాసిల్-ట్రాన్స్విజయ్ సేతుపతి- సూపర్ డీలక్స్సౌత్ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపత ఏ క్యారెక్టర్ ను అయినా ఇట్టే చేయగలడు.
తను సూపర్ డీలక్స్ అనే సినిమాలో ట్రాన్స్ జెండర్ గా నటించి మెప్పించాడు.నాగార్జున- అన్నమయ్యటాలీవుడ్ మన్మథుడు నాగార్జుభక్తి పరమైన మూవీ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.
తను చేసిన అన్నమయ్య సినిమాలో అద్భుత నటన కనబరిచాడు.
బాలక్రిష్ణ- భైరవదీపం
నందమూరి బాలక్రిష్ణ భైరవదీపం సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేశాడు.అందవిహీనంగా ఉండే గూనివాడి పాత్రలో నటించి మెప్పించాడు.
చిరంజీవి
విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషి సినిమా చేశాడు చిరంజీవి.ఈ సినిమాలో చెప్పులు కుట్టేవాడి పాత్ర చేశాడు.అప్పట్లో ఇదో సంచలనంగా మారింది.
కమల్ హాసన్- భామనే సత్యభామనేఈ సినిమాలో ఆయన బామ్మ గెటప్ లో అదరగొట్టాడు.విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.