సవాళ్ళు, ప్రతి సవాళ్ళ తో రణరంగంగా తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాల హవా అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది.తెలంగాణలో టీఆర్ఎస్ తరువాత పట్టుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుండగా టీఆర్ఎస్ కూడా క్షేత్ర స్థాయిలో తనదైన శైలిలో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

 Challenges Telangana Politics On The Battlefield With Every Challenge  ,bandi Sa-TeluguStop.com

అయితే ఇప్పటికే బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య మాటల తూటాలు పేలుతున్న తరుణంలో తాజాగా జరిగిన రాళ్ళ దాడి ఘటనతో మరింత ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ఉంది.అయితే ఈ అంశాన్ని రాజకీయంగా పెద్ద ఎత్తున వాడుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ ఘటనను మరింతగా ముందుకు తీసుకెళ్ళే విధంగా వ్యూహ రచన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ నుండి కీలక నాయకులు ఎవరూ ఈ ఘటనను అంతగా సీరియస్ గా తీసుకోలేదు.

ఒకవేళ స్పందించినా రైతులు ఆగ్రహానికి గురయ్యారు అనే విధంగా మాత్రమే టీఆర్ఎస్ అభిప్రాయం ఉంటుందని అంతకు మించి వేరే విధమైన అభిప్రాయాన్ని ఆశించలేము.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ అని ప్రజలకు సంకేతాలిస్తున్న తరుణంలో ఈ ఘటనను అందుకు తగ్గట్టుగా మార్చుకునే అవకాశం ఉంది.ఇప్పటికే కరీంనగర్ ఘటనపైనే ప్రివిలేజ్ కమిటీ విచారిస్తున్న నేపథ్యంలో మరొక ఎంపీపై రాళ్ళ దాడి ఘటన అనేది మరో సారి ఢిల్లీ వేదికగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరి ఈ ఘటనపై ఇంకా ఢిల్లీ స్థాయిలో ఎటువంటి స్పందన రాకున్నా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రణరంగానికి వేదిక అయ్యే అవకాశం ఉంటుంది.మరి ఈ టీఆర్ఎస్, బీజేపీ పార్టీ రాజకీయ దుమారం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది  అలాగే బీజేపీ రకరకాల కార్యాచరణలు ప్రకటించి కొనసాగిస్తుందా అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

Challenges Telangana Politics On The Battlefield With Every Challenge ,bandi Sanjay , Bjp Party , Cm Kcr , Telangana Politics , Bjp Party , Trs Party - Telugu @bandisanjay_bjp, @cm_kcr, Bandi Sanjay, Bjp, Telangana, Trs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube