సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య హాట్ హాట్ గా హుజూరాబాద్ రాజకీయం

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో  రాజకీయాన్ని హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది.

 Challenges Huzurabad Politics Is Hot Among Every Challenge-TeluguStop.com

అయితే ప్రస్తుతం హరీష్ రావు టీఆర్ఎస్ ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు హరీష్ రావు మాటల తూటాలు ఈటెల రాజేందర్ పైన బీజేపీ పైనే పేలుస్తున్న పరిస్థితి ఉంది.

అయితే పోటీ ఇద్దరి మధ్యే ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పట్ల విమర్శల జోరును తగ్గిస్తున్న పరిస్థితి ఉంది.

 Challenges Huzurabad Politics Is Hot Among Every Challenge-సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య హాట్ హాట్ గా హుజూరాబాద్ రాజకీయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు ప్రజల దృష్టంతా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా, బీజేపీ విజయం సాధిస్తుందా అనే దానిపై మాత్రమే ఉన్న తరుణంలో కాంగ్రెస్ ఎంత పోరాటం చేసినా విజయ బావుటా ఎగరవేయడం చాలా కష్టం అనే భావన ప్రజల్లో కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాన్ని మరింత హీటెక్కించిన పరిస్థితి ఉంది.నీ హయాంలో చేసిన అభివృద్ధిపై జమ్మికుంట గాంధీ చౌరస్తా దగ్గరికి చర్చ కు వస్తావా అంటూ మంత్రి హరీష్ రావు ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు.

Telugu @harish2you, #telanganapolitics, Bjp, Bjp Leader Etela, By-elections In Huzurabad, Etela Rajender, Harish Rao Challenges Etela Rajender, Huzurabad Politics, Telangana Politics, Trs-Political

అయితే హరీష్ రావు సవాల్ పై ఈటెల ఇంకా స్పందించకపోయినా త్వరలో స్పందించే అవకాశం ఉంది.అయితే హరీష్ రావు మొత్తానికి రకరకాల సవాళ్ళు ప్రతి సవాళ్ళతో జనాల చూపును టీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంతేకాక ఈటెల టార్గెట్ గా రానున్న రోజుల్లో విమర్శల జోరు మరింత పెరిగే అవకాశం ఉంది.ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్ని కాక పుట్టిస్తోంది.

ఎవరు గెలుస్తారనే ఆసక్తిని రోజురోజుకు పెంచుతున్న పరిస్థితి ఉంది.

#HarishRao #Huzurabad #@harish2you #Etela Rajender #BJP Etela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు