సోషల్‌ మీడియా సాక్షిగా నేతల మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే, ఎంపీల మధ్య పొలిటికల్ వార్.. ??

మాటలు నేర్చిన వారే రాజకీయాల్లో రాణిస్తారట.లేదంటే నాయకుల నోటి దూకుడుకు తట్టుకోలేక నాకు రాజకీయాలు వద్దూ అంటూ వెళ్లిపోవలసిన పరిస్దితులు తలెత్తుతాయి.

 Challenges Between Leaders As Witnessed On Social Media .. Political War Between-TeluguStop.com

ఇకపోతే నాగార్జున సాగర్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటికే అక్కడి రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.ఈ నేపధ్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలో కూడా పొలిటికల్ వార్ స్పీడ్ అందుకుందట.

ఈ దోబూచులాటలో ఒకరేమో ఎమ్మెల్యే.ఇంకొకరు ఎంపీ.వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు.అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులు కూడా, కానీ ఎన్నికలు ముగిసినా రాజకీయ ఎత్తుగడలు ఆగలేదట.

ఇప్పుడవి ముదిరి తొడలు కొట్టుకుంటూ, సవాళ్లు విసురుకుంటున్నారట.ఈ పొలిటికల్ వార్‌లో, పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేద్దాం అని ఒకరంటే, కొడంగల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో చర్చ పెడదాం అని మరొకరు హీటెక్కిస్తున్నారట.

Telugu Kodangal, Mlapatnam, Nagarjuna Sagar, War-Latest News - Telugu

సవాళ్లకు బలాన్ని చేకూరుస్తూ, ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టులు, కామెంట్స్‌ తో ఊదరగొడుతున్నాయి.ఇంతకు ఆ నాయకులు ఎవరంటే.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి.

ఇక మాటలకే పరిమితమైతే బాగుండదని భావించిన ఈ నాయకులు కొడంగల్‌ అభివృద్ధిపై బహిరంగ చర్చకు బయలుదేరారు.

ఈ నేపధ్యంలో వీరిని కోస్గిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కానీ ఎక్కడ తగ్గకుండా, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా రాజకీయ వేడిని లైవ్‌లోనే ఉంచేందుకు రెండు పార్టీల నేతలు ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నారట.మరి ముందు ముందు ఈ వార్ ఏ సైడ్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube