Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అమ్మాయిలపై మళ్ళీ హాట్ కామెంట్స్ చేసిన చలపతిరావు -Chalapathi Rao Makes Offensive Comments On Girls Again

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ లో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్ళపై చేసిన వ్యాఖలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో. ఆడవాళ్ళు హానికరమో కాదు తెలియదు కానీ పక్కలోకి మాత్రం పనికొస్తారు అంటూ చలపతిరావు వ్యాఖ్యానించడం, అప్పుడు అక్కడ నవ్వినవారంతా, ఆ తరువాత రివర్స్ గా చలపతిరావు నే కామెంట్ చేయడం, మహిళా సంఘాలు, న్యూస్ డిబేట్స్, అబ్బో ఎంత రచ్చ జరిగిందో. ఇప్పుడు మళ్ళీ అలాంటి వివాదమే పుట్టేలా ఉంది. ఎందుకంటే చలపతిరావు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేసారు.

ఈకాలం ఆమ్మయిల గురించి మాట్లాడూతూ ” ఆడపిల్లలు ప్యాంటు షర్ట్ వేసుకోవడం తప్పు అని అనట్లేదు కాని, ఆడపిల్లలకి ఒణిలు ఎందుకు ఇస్తారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి ? **** కనబడుతుందని, అది కప్పుకోవడానికి ఇస్తారు. కాని ఈరోజుల్లో ఒణిని మెడకు, నడుముకి కట్టుకొని తిరుగుతున్నారు. ఒణి ఎందుకు వాడాలో తెలియదు. చెబితే చాదస్తం, ముసలివాడు అంటారు. ఎవరి ఖర్మ వారిది. అలాంటప్పుడు కుర్రాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే పడాలి. ఓపిక ఉంటే గొడవకి దిగాలి. కాని ఎంతమందితో గొడవకి దిగుతారు? అందుకే తలవంచుకొని వెళ్ళాలి, లేదంటే పధ్ధతి మార్చుకోవాలి. చీరకట్టుకొని వెళ్ళే అమ్మాయిలను కూడా అంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ఏమైనా అనొచ్చు. అవన్నీ పట్టించుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి” అంటూ ఈకాలం అమ్మాయిలపై సంచలన కామెంట్స్ చేసారు చలపతిరావు.

కుర్రాళ్ళు కామెంట్ చేస్తారు, ఇది ప్రజాస్వామ్య దేశం, ఆడపిల్లలే పధ్ధతి మార్చుకోవాలి … రానున్న రోజుల్లో ఈ వాక్యాలు వివాదం సృష్టించడం ఖాయం. చలపతిరావు మళ్ళీ తన వ్యాఖ్యల వల్ల ఇబ్బందుల్లో ఇరుకున్నట్టే.

Continue Reading
More Posts
To Top