ఆ రూమర్స్ సృష్టించడం వల్లే నాకు ఈ పరిస్థితి..చివరికి వాళ్ళ పెళ్ళాల దగ్గర కూడా.! చంటి సంచలన కామెంట్స్!

ప్రతి ఇంట్లో అందరూ కూర్చొని మిస్ అవ్వకుండా చూసే షో ఏంటి అంటే టక్కున ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ అని చెప్తారు.ఈ షో ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్స్ చాలా మందే ఉన్నారు.

 Chalaki Chanti Reveals About Rumors On Him-TeluguStop.com

వారిలో ఒకరు చలాకి చంటి.ప్రస్తుతం తను జబర్దస్త్ షో లో చేయడం లేదు, ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయ్యే నా షో నా ఇష్టం కి యాంకర్ గా చేస్తున్నాడు, టీవీ షోస్ లో బిజీ గా ఉంటూనే తనకి వచ్చే ప్రతి సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకొని తన నటనతో అందరిని అలరిస్తున్నాడు.

అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు.తాను అన్ని విషయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అని చెప్పారు.అందుకే నాకు అవకాశాలు రావడం లేదు.దర్శకులకు నేను కనిపించినప్పుడు పలకరిస్తారు.కానీ గౌరవం ఇవ్వరు.అందుకు నాకు ఎలాంటి భాద లేదని చంటి తెలిపాడు.

దర్శకులకు నన్ను తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది.కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్లు చెడగొడుతారు.షూటింగ్స్ కి టైమ్ కి రాడంట అంటూ చెడగొడతారు.నిజానికి వాళ్ళతో నేనెప్పుడూ పని చేయలేదు.

నా గురించి తెలియకుండా అలా చెప్పేస్తుంటారు.అది నిజం కాకపోయినా దర్శకులు అదే నిజమేమో అని అనుకుంటారు.

ఇలాంటి పుకార్ల వలన చాలా మంది ఆర్టిస్టులు, హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయి అని చలాకి చంటి తెలిపాడు.చంటి డబ్బు కోసం గొడవ పెట్టుకుంటాడు.

అతడు వద్దులే అని ఇంకో దర్శకుడికి చెబుతారు.

అంతేకాదు ఇక్కడ అవకాశాలు రావాలంటే అవతలి వాళ్ళని కూడా నిత్యం పొగుడుతూనే ఉండాలి.చివరికి వారి పెళ్ళాం పిల్లల దగ్గరకి వెళ్లి వాళ్ళని కూడా పొగడాలి అని ఆవేదన వ్యక్తం చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube