పాప పుట్టడంతో మూడు గంటలు ఏడ్చేసిన చలాకీ చంటి..

సినిమాల ద్వారా, కామెడీ షోల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో చలాకీ చంటి ఒకరు.చంటి అసలు పేరు వినయ్ మోహన్ కాగా రేడియో స్టేషన్ లో పని చేసే సమయంలో కొన్ని కారణాల వల్ల చంటిగా పేరును మార్చుకున్నారు.

 Chalaki Chanti About His Mother Death And Daughter Birth, Chalaki Chanti,jabarda-TeluguStop.com

జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టిన తరువాత చంటి పేరు చలాకీ చంటిగా మారింది.

ఒక ఇంటర్వ్యూకు హాజరైన చంటి తనకు వాయిస్ వల్లే కమెడియన్ గా సినిమాల్లో, కామెడీ షోలలో గుర్తింపు వచ్చిందని.

అయితే తన వాయిస్ తనకే నచ్చదని తెలిపారు.ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను సైతం చంటి వెల్లడించారు.జల్లు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యానని.ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు సినిమాలోని పాత్రకు మంచి గుర్తింపు దక్కిందని తెలిపారు.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabardasth, Jabardasth Show-Movie

జబర్దస్త్ షో గురించి చంటి మాట్లాడుతూ తనలాంటి ఎంతోమంది ఎదిగే కమెడియన్లకు జబర్దస్త్ మంచి ఫ్లాట్ ఫామ్ అని.జబర్దస్త్ షో వల్ల చాలామంది సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.కొందరు తన గురించి నెగిటివ్ గా చేసిన ప్రచారం వల్ల 16 సినిమాల్లో ఆఫర్స్ పోయాయని చెప్పారు.తనకు అమ్మ చనిపోయిన సమయంలో చాలా బాధ వేసిందని.

తనకు ఐదేళ్ల వయస్సు ఉన్న అమ్మ చనిపోయిందని అన్నారు.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabardasth, Jabardasth Show-Movie

గ్యాస్ లీక్ కావడం వల్ల కళ్ల ముందే అమ్మ చనిపోయినా తనకు ఆ సమయంలో ఏమీ తెలీదని పదిరోజుల తర్వాత అమ్మ చనిపోయిందని అర్థమై బాగా ఏడ్చానని అన్నారు.ఆ తరువాత కూతురు పుట్టిన సమయంలో మూడు గంటల పాటు ఏడ్చానని.తన తల్లి కూతురు రూపంలో వచ్చిందని కూతురు పుట్టిన సమయంలో అనిపించిందని తెలిపారు.

తనది లవ్ మ్యారేజ్ అని నటన, టాలెంట్ చూసి ఒక అమ్మాయి తనను ప్రేమించిందని చంటి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube