పెళ్లి వద్దంటున్న చైతూ.. ఒక్కసారిగా అలా మాట్లాడేసాడుగా..వైరల్ వీడియో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగచైతన్య సమంత జంట ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Chaitu Said Dont Getting Married Viral Video, Naga Chaitanya, Tollywood, Hero, C-TeluguStop.com

ఏం మాయ చేసావే సినిమా ద్వారా ప్రేమించుకుని అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత వీరిద్దరు ఎవరి కెరియర్లో వాళ్లు ఎంతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే సమంత వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీ కాగా నాగచైతన్య కూడా పలు సినిమాల ద్వారా బిజీ అయ్యారు.

ఇలా విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు.

ఇక పోతే ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.నాగచైతన్య విడాకుల తర్వాత ప్రతి ఒక్కరి ఫోకస్ ఈ జంట పైనే ఉంది.

ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ విషయమైనా వెంటనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఇలా బంగార్రాజు మ్యూజిక్ నైట్స్ కార్యక్రమంలో భాగంగా వేదికపై నాగచైతన్య హీరోయిన్ దక్షా నాగార్కర్‌ మధ్య జరిగిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది.

Telugu Krithishett, Marrige, Naga Chaitanya, Nagarjuna, Tollywood-Movie

ఈ క్రమంలోనే తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది.సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర చానల్స్ ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తాయి.ఈ క్రమంలోనే జీ తెలుగులో బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నాగార్జున, నాగచైతన్య, కృతి శెట్టి హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోమో లో భాగంగా నాగార్జున ఒకవైపు నాగచైతన్య ఒక వైపు ఉండి అంత్యాక్షరిలో పాల్గొన్నారు.

Telugu Krithishett, Marrige, Naga Chaitanya, Nagarjuna, Tollywood-Movie

ఇలా రెండు టీమ్స్ పోటీపడి పాటలు పాడుతుండగా వెంటనే స్క్రీన్ పై నాగార్జున మన్మధుడు సినిమాలో ఫోటో రావడంతో వెంటనే నాగచైతన్య టీమ్ ఆ సినిమాలోని వద్దురా… సోదరా.పెళ్లంటే నూరేళ్ల మంటరా.అంటూ సాగిపోయే పాటను పాడారు.ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డోంట్ మ్యారీ.బీ హ్యాపీ అంటూ ఫుల్ జోష్ లో ఈ పాటను పాడినట్లు తెలుస్తుంది.అయితే నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఇలా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొని ఇలా సంతోషంగా కనిపించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube