దొంగల కొత్త రకం దోపిడీ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు  

Chain Snatching Incident Caught On Camera-

రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళ మేడలో గొలుసు లాక్కొని వెళ్లిపోవడం పాత పద్దతి.ఇప్పుడు కొత్త పద్దతి ఏంటంటే మహిళ చేత్తోనే అన్నీ ఇచ్చిన తరువాత మాయచేసేయడం కొత్త పద్దతి.వినడానికి కొత్తగా ఉన్నా ఒడిస్సా లో మాత్రం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది...

Chain Snatching Incident Caught On Camera--Chain Snatching Incident Caught On Camera-

స్వయంగా ఆ మహిళే దొంగలకు నగలను తీసిమరీ ఇచ్చింది.వారు ఎదో బెదిరిస్తే అలా చేయలేదు,వారి పక్కా ప్లానింగ్ తో ఆ మహిళ చేతే ఒంటిపై నున్న నగలను అన్నీ తీసి దొంగ చేతికి తాళాలు అందించినట్లుగా ఆ మహిళ వారికి అందించింది.అసలు విషయంలోకి వెళితే… ఒడిస్సా లో భవానిపట్నం సమీపంలోని కలహండి పట్టణంలో ఉదయమే వాకింగ్ కోసం అని ఒక వృద్ధురాలి వెళ్ళింది.అయితే ఆమెను టార్గెట్ చేసిన దొంగల ముఠా తెలివిగా ఆమె వద్ద ఉన్న నగలను కొట్టేయాలని భావించి తెలివిగా ప్లాన్ చేశారు.

నేరుగా ఆమె వద్దకు వెళ్లి తాము పోలీసులము అని చెప్పి ముందుగా ఆమెను నమ్మించి ఇలా నగలు వేసుకొని బయటకు తిరగొద్దు అంటూ చెప్పి తన నగలను తీయించి సంచిలో వేయించారు.ఆమె ఎదురుగానే సంచిలో వేసి ఆమెకు తిరిగి సంచి అందించడం తో ఆ వృద్ధురాలు నమ్మకంగా ఇంటికి వెళ్ళిపోయింది.

Chain Snatching Incident Caught On Camera--Chain Snatching Incident Caught On Camera-

తీరా ఇంటికి వెళ్లిన తరువాత సంచి తెరచి చూసుకుంటే అసలు విషయం అర్ధం అయ్యింది.వారు బంగారాన్ని కాపాడడానికి వచ్చిన పోలీసులు కాదు బంగారం దోచుకోవడానికి వచ్చిన దొంగలు అన్న విషయం అర్ధమై లబోదిబోమని గుండెలు బాదుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోగొట్టుకున్న నగల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని చెబుతోంది బాధిత మహిళ.ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది...