నిజాలు చెబుతున్నాడని సొంత జర్నలిస్ట్‌ను మాయం చేసిన చైనా

చైనాలో కరోనా వైరస్‌ ప్రభంజనం మామూలుగా లేదు.ప్రపంచ దేశాలకు కనిపిస్తున్నదాని కంటే దాదాపుగా పది రెట్టు అధికంగా కరోనా వైరస్‌ చైనాలో ఉన్నట్లుగా కొందరు అభిప్రాయ పడుతున్నారు.

 Chaina Journalist Kiyasi Missing Abouth The He Says The Truth In Carona Virus-TeluguStop.com

కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి వాస్తవాలను మరియు వైరస్‌ బారిన పడ్డ రోగుల విషయాన్ని కాని మీడియాకు తెలియకుండా ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటీ అనేది తెలుసుకునేందుకు అక్కడకు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు.

ఇదే సమయంలో అక్కడ జర్నలిస్ట్‌లు అసలు విషయాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వారిని కూడా చెప్పనివ్వడం లేదు.తాజాగా వూహాన్‌ నుండి కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆ వైరస్‌తో బాధపడుతున్న రోగుల గురించి పలు సార్లు సోషల్‌ మీడియా ద్వారా తన ఛానెల్‌ ద్వారా చెప్పిన జర్నలిస్ట్‌ కియుషి అనే వ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదు.

అసలు అతడు ఏమయ్యాడు, ఏం చేశారు అనే విషయాలపై క్లారిటీ ఇవ్వడం లేదు.కరోనా వైరస్‌ నిజాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతోనే అతడిని మాయం చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube