వైరల్‌ : చైనా మృతుల లెక్కపై ఎవరి వాదన వారిది.. ఏ లెక్కలు నమ్మాలి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ వైరస్‌కు మూల కారణంగా చైనాలోని వూహాన్‌ నగరంగా చెబుతున్నారు.

 Is China Telling Facts About Corona Deaths Meany People Says No, Chaina Corona V-TeluguStop.com

చైనా కూడా ఇప్పటికే ఆ విషయాన్ని ఒప్పుకుంది.అయితే చైనాలో 80 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లుగా అధికారికంగా చెబుతోంది.

కాని మృతుల సంఖ్య విషయంలో మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తుందని ప్రపంచ దేశాలు మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాయి.నేడు కరోనా లెక్క ప్రకారం చైనాలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 81 వేలు కాగా కేవలం 3305 మంది మాత్రమే మృతి చెందారు.

Telugu Chaina, Chaina Corona, Corona, National, Wuhan-General-Telugu

కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఇటలీ, అమెరికా, స్పెయిన్‌ ఇంకా పలు దేశాల్లో విపరీతంగా పెరుగుతోంది.ఇదే సమయంలో మృతుల సంఖ్య కూడా అత్యంత భయానకంగా పెరుగుతోంది.ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 వేల మంది మృతి చెందినట్లుగా నిర్థారించారు.అయితే వైరస్‌ను కనిపెట్టకుండా వేలాది మందికి అంటిచిన చైనాలోని వుహాన్‌లో మాత్రం కేవలం మూడు వేల మంది చనిపోయినట్లుగా చెప్పడం ఈ సమయంలో అందరికి అనుమానాలు కలిగిస్తుంది.

చైనాలో వైరస్‌ అత్యంత స్పీడ్‌గా విస్తరించింది.ఇదే సమయంలో చైనాలో వైరస్‌ వల్ల మృతుల సంఖ్య కూడా అత్యధికంగా ఉందని అంటున్నారు.

చైనాలో మీడియాపై ఆంక్షలు ఉంటాయి.చైనాలో చీమ చిటుక్కుమన్నా కూడా ప్రపంచ దేశాలకు తెలియాలి అంటే చైనా అధికారిక మీడియా ద్వారానే తెలియాల్సి ఉంటుంది.

ఇతర దేశాల్లో మాదిరిగా చైనాలో మీడియా స్వాతంత్య్రం అస్సలు ఉండదు.కనుక చైనాలో ఏం జరుగుతుంది అనేది అక్కడ ప్రభుత్వం చెబితే కాని తెలియని పరిస్థితి.

Telugu Chaina, Chaina Corona, Corona, National, Wuhan-General-Telugu

ఒక అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టు విశ్లేషణ ప్రకారం చైనాలో జనవరి 23 నుండి మార్చి 25 వరకు అంటే రెండు నెలల కాలంలో దాదాపుగా 80 వేల చితాభస్మం కుండలను బంధువులకు ప్రభుత్వం అందజేసినట్లుగా చెబుతున్నారు.అక్కడ దహన సంస్కారాు అన్ని కూడా ప్రభుత్వాలు చేస్తాయి.వారికి చెందిన చితా భస్మంను బంధువులకు ఇస్తారు.అలా ఈ రెండు నెలల కాలంలో 80 వేలకు పైగా చితాభస్మాలు ఇచ్చారట.అంటే చైనాలో కరోనా వైరస్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్షలను మించి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరో అంతర్జాతీయ రిపోర్టర్‌ తన బ్లాగ్‌లో చైనాలోని వూహన్‌లో ఈమద్య కాలంలో ఏకంగా కోటిన్నర మొబైల్‌ కలెక్షన్స్‌ ఆగిపోయాయి.

కొత్త కలెక్షన్స్‌ పెరిగినా కూడా కోటికి పైగా కలెక్షన్స్‌ తగ్గినట్లుగా స్థానిక టెలికాం సంస్థ నుండి తమకు సమాచారం ఉందని ఆయన అన్నాడు.అంటే ఎవరైతే మొబైల్‌ వాడటం లేదో వారంతా కూడా చనిపోయి ఉంటారేమో అనేది అతడి అనుమానం.

ఒక్కరు రెండు సిమ్‌లు వాడుతున్నా కూడా

75 లక్షల

మంది ప్రస్తుతం లేరంటూ ఆయన భయంకర విషయాన్ని ఆందోళనకరంగా చెప్పాడు.

ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రచారం చేస్తుంటే చైనా మాత్రం ప్రస్తుతం అంతా బాగుంది.

వైరస్‌ను తాము జయించాము.ప్రస్తుతం తాము ఇతర దేశాలకు సాయం చేసేందుకు ముందుకు వస్తాం అంటూ ప్రకటించింది.

చైనాలో ఉన్న పరిస్థితులపై నిజాలు తెలియాలి అంటే అక్కడకు ఎవరైనా వెళ్లాలి.కాని ప్రస్తుతం చైనా ప్రభుత్వం అక్కడి విషయాలను బయటకు వెళ్లకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలకు పాల్పడ్డట్లుగా చెబుతున్నారు.

కాని నిజం అనేది నిప్పు వంటిది.ఖచ్చితంగా అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడకుండా మాత్రం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube