కరోనా బాధితుల సంఖ్యను తప్పు చెబుతున్న ఏపీ ప్రభుత్వం

కరోనా మృతుల సంఖ్య పాజిటివ్‌ల సంఖ్యను ఏపీ ప్రభుత్వం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం లేదని, దాని వల్ల తీవ్రమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.ప్రభుత్వం ప్రతిష్ట కోసం కరోనా మృతుల సంఖ్యను చెప్పడం లేదని, దాని వల్ల మరింత మంది పాజిటివ్‌ అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

 Chandrababu Naidu Write A Letter To Jagan Mohan Reddy About Corona Count, Chaina-TeluguStop.com

ఈ విషయమై ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది.

కరోనా వ్యాధికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై కొన్ని అనుమానాలు ఉన్నాయి.

ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉంది.కరోనా మృతులు ఇంకా బాధితుల సంఖ్యను సక్రమంగా ప్రకటించినప్పుడు మాత్రమే దాని నివారణకు సాధ్యం అవుతుందని నిజాలు దాచిపెట్టడం కరెక్ట్‌ కాదని అన్నారు.

ఈ సమయంలో ఉద్యోగులకు బాసటగా ఉండాలి.ప్రజలందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

ఉద్యోగులకు జీతాలు కట్‌ చేయడం, సగతం జీతాలు ఇవ్వడం వంటివి మానేయాలి.పేదలకు ఒకేసారి మూడు నెలలకు సరిపడేన్ని రేషన్‌ సరుకులు ఇంకా పెన్షన్‌ను ఇచ్చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశాడు.

బాబు లేఖపై వైకాపా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube