ట్రంప్‌కు రెండవ సారి కరోనా పరీక్షలు

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభన భయంకరంగా ఉంది.అతి తక్కువ సమయంలోనే కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2.43 లక్షలకు చేరింది.ఈ సంఖ్య మరో వారంలో మిలియన్‌ మార్క్‌ చేసే అవకాశం ఉందనే ఆందోళన అక్కడ వ్యక్తం అవుతోంది.

 America President Donald Trump Do The  Second Time Corona Test, Chaina, Corona V-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అత్యంత స్పీడ్‌గా పెరుగుతోంది.ఈసమయంలోనే అమెరికా వైట్‌ హౌస్‌లోకి కూడా కరోనా వైరస్‌ వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.వైట్‌ హౌస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అయ్యింది.

గత నెలలో ట్రంప్‌కు మొదటి సారి కరోనా వైరస్‌ టెస్టులను నిర్వహించారు.

ఆ సమయంలో టెస్టు రిపోర్ట్‌ నెగటివ్‌ వచ్చింది.తాజాగా మరోసారి కరోనా టెస్టును ట్రంప్‌ చేయించుకున్నాడు.

ఈసారి కూడా రిపోర్ట్‌ నెగటివ్‌ వచ్చినట్లుగా ఆయన స్వయంగా తెలియజేశాడు.కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పరిస్థితి చేయి దాటి పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తేలడంతో అమెరికన్స్‌ కాస్త అయినా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube