తస్మాత్‌ జాగ్రత్త : కరోనా కేసులు మొదటి మిలియన్‌కు 4 నెలలు... తర్వాత మిలియన్‌కు మాత్రం రెండే వారాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన మామూలుగా లేదు.కరాళ నృత్యంతో కరాన ప్రపంచం మొత్తంను చుట్టేస్తోంది.

 Facts About Corona Virus Its Is Going To Effect More Than 10 Million People In W-TeluguStop.com

ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 205 దేశాలకు కరోనా విస్తరించింది.కరోనా నుండి ప్రపంచ దేశాలు బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు ఈ మహమ్మారికి మందు కనిపెట్టలేదు.కరోనా పాజిటివ్‌ కేసును మొదట చైనాలో గుర్తించిన విషయం తెల్సిందే.

గత ఏడాది డిసెంబర్‌ ఆరంభంలోనే ఈ మహమ్మారిని గుర్తించారు.ఇప్పటికి నాలుగు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది.

Telugu Lock, America Corona, Chaina Corona, India Lock, Nizamuddin-General-Telug

నాలుగు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మందికి కరోనా వైరస్‌ అంటింది.నాలుగు నెలల్లో మిలియన్‌ మందికి అంటింది అనే విషయం కాస్త ఊరటను కలిగించే విషయమై అయినా మరో మిలియన్‌ మందికి కేవలం రెండు లేదా మూడు వారాల్లోనే ఈ వైరస్‌ అంటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఈ సంఖ్య ఎక్కడవకు వెళ్తుందో అర్థం కావడం లేదు.కేవలం అమెరికాలోనే ఏప్రిల్‌ చివరి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా మిలియన్‌ మార్క్‌ చేరే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Telugu Lock, America Corona, Chaina Corona, India Lock, Nizamuddin-General-Telug

ఇక మన దేశంలో కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య ప్రస్తుతానికి వేల్లో ఉన్నా కూడా వచ్చే నెల రోజుల్లో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేశంలో కాస్త ముందుగానే తేరుకుని లాక్‌ డౌన్‌ విధించి కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా నిజాముద్దీన్‌ సంఘటన కారణంగా ఈ కేసుల సంఖ్య అమాంతం పెరగబోతుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగు బయట పెట్టాలి.అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.

Telugu Lock, America Corona, Chaina Corona, India Lock, Nizamuddin-General-Telug

ఇలాంటి సమయంలో కనీసం పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌ పెట్టుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు.ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తల్చుకుంటేనే గుండె దడ వస్తుంది అంటూ అంతర్జాతీయ వైధ్యవిభాగం అధికారి ఒకరు చెబుతున్నారు.ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అని, ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది వరకు ఎఫెక్ట్‌ అయ్యి వదిలేస్తే పర్వాలేదు కాని ఇది మరింతగా విస్తరించే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube