Apple ఉద్యోగం కావాలంటే ముందు ఈ 4 లక్షణాలు ఉండాలంటున్న CEO.. మీ దగ్గరున్నాయా?

Apple కంపెనీలో ఉద్యోగం అనేది నేటి యువత కల అని చెప్పుకోవాలి.అయితే అందులో వుద్యోగం పొందడం అంత తేలికైన విషయం ఏమీకాదు.

 Apple ఉద్యోగం కావాలంటే ముందు ఈ 4 ల�-TeluguStop.com

తాజాగా Apple కంపెనీ CEO ‘టిమ్ కుక్’ ఈ విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు.ఇందులో వుద్యోగం కావాలనుకునే అభ్యర్థికి కచ్చితంగా 4 లక్షణాలు ఉండాలంట.

ఈ విషయాన్ని ఇటలీలోని యూనివర్శిటీ ఆఫ్ నేపుల్స్ ఫెడెరికోలో కుక్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.ఇక్కడ అతను గౌరవ డిగ్రీని అందుకున్నారు.

ఉద్యోగులు తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని కుక్ విద్యార్థులకు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ… “ప్రపంచాన్ని నిజంగా మార్చాలని కోరుకునే, మెరుగైన సమాజం నిర్మించాలనుకునే ఉద్యోగులు మా దగ్గర పని చేస్తున్నారు.అందుకే ఫలితాలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి.” కొత్తగా యాపిల్‌లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ప్రత్యేకంగా 4 లక్షణాలను కలిగి ఉండాలని తెలిపారు.మొదట ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి.ఇద్దరు బలమైన వ్యక్తులు కలిస్తే అద్భుతమైన పని చేయగలరు.వ్యక్తిగత సహకారం చాలా కీలకం అని చెప్పారు.నేను నా ఆలోచనను మీతో పంచుకుంటే, ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుంది.

ఫలితం మెరుగ్గా ఉంటుంది అని అన్నారు.

తరువాత సృజనాత్మకత (క్రియేటివిటీ) గురించి మాట్లాడారు.క్రియేటివిటీ అనేది ఆపిల్ ఉద్యోగులలో వెతుకుతున్న మరొక లక్షణం.“మేము విభిన్నంగా ఆలోచించే వ్యక్తుల కోసం చూస్తున్నాము.ఒక సమస్యను వివిధ కోణాల నుండి చూసి దానిని పరిష్కరించడానికి సృజనాత్మకతను జోడించాలి.నేర్చుకోవాలనే ఉత్సుకత కలిగి ఉండాలి.“ఎవరైనా చిన్నప్పుడు ప్రశ్నలు అడగడం ప్రారంభించినప్పుడు, సమాధానాలు చెప్పే వ్యక్తిపై ఒత్తిడి ఉంటుంది.దాని కోసం ఆలోచిస్తారు.కాబట్టి, మేము ప్రజలలో ఈ సహజమైన ఉత్సుకత కోసం చూస్తున్నాము.” అని అన్నారు.చివరగా నైపుణ్యం గురించి మాట్లాడారు.సంబంధిత నైపుణ్యం ఉన్న వ్యక్తులు తమ వర్క్‌ఫోర్స్‌లో చేరాలని Apple కోరుకుంటోందని కుక్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube