ఆ కుక్క కోసం రూ.42.93 కోట్లు!

పెంపుడు జంతువులు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.ఎవరైనా సరే ఇంట్లో ఒక పెంపుడు జంతువును పెంచుతున్నారు అంటే అది కుక్క అయినా దాన్ని కుక్క అని పిలవరు.

 Ceo Spends 42crores For His Dog-TeluguStop.com

అది కూడా వారి ఇంట్లో ఒక మనిషే.దానికి చిన్న సమస్య వచ్చిన అసలు తట్టుకోలేరు.

దానికోసం ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకొస్తారు.అసలు దాన్ని కుక్కలా చేసుకోరు అనుకోండి.

అంత ప్రేమ ఉంటుంది పెంపుడు కుక్కపై.

అలానే.”వెదర్‌టెక్” అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ కూడా తన కుక్కను బ్రతికించిన డాక్టర్లకు కోట్ల రూపాయిలను ఇచ్చారు.ఏంటి అనుకుంటున్నారా.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క స్కౌట్‌ను ఆ సీఈఓ పెంచుకుంటున్నాడు.

అయితే ఆ కుక్క ఉన్నట్టుండి గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైంది.

డాక్టర్ల వద్దకు వెళ్తే.

స్కౌట్ గుండెలో గడ్డ ఉందని, రక్తంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.అయితే ఆ కుక్క బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారు అన్నారు.

దీంతో అతను స్కౌట్‌ను యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌‌లో చేర్చారు.

అక్కడ ‘స్కౌట్’కు కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ, ఇమ్యునోథెరఫీలు అందించారు.

దీంతో స్కౌట్ గుండెలో గడ్డ 90 శాతానికి కరిగిపోయి స్కౌట్ ఆరోగ్యం మెరుగుపడింది.ఈ విషయం తెలియగానే మ్యాక్‌నైల్ సంతోషంతో స్కౌట్ ని ఆరోగ్యంగా తయారు చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పేందుకు అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రకటన కోసం 6 మిలియన్ డాలర్లు వెచ్చించి ఆశ్చర్యానికి గురి చేశారు అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.42.93 కోట్లు.దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube