కరోనా విజృంభణ… ఫేస్ బుక్ సీఈవో రిక్వెస్ట్..?  

facebook, facebook CEO Mark zucker Berg, Mask,Instagram post - Telugu Facebook, Facebook Ceo Mark Zucker Berg, Instagram Post, Mask

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.ఇక అగ్రరాజ్యమైన అమెరికా లో మహమ్మారి వైరస్ విజృంభణ గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Ceo Mark Zucker Berg Request People Mask

రోజురోజుకు నమోదవుతున్న కేసులతో అసలు అమెరికా పరిస్థితి భవిష్యత్తుతో ఎలా ఉంటుంది అన్నది ఊహకందని విధంగా ఉన్నది.అమెరికాలో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు వైరస్ గురించి అవగాహన కల్పించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలందరికీ సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఇక విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై స్పందించిన ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఆయన సతీమణి తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ ఒక ఆసక్తికర రిక్వెస్ట్ చేశారు.జుకర్ బర్గ్ ఆయన భార్య మాస్కు ధరించి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ… అందరూ మాస్క్ ధరించండి అంటూ రిక్వెస్ట్ చేశారు.

కరోనా విజృంభణ… ఫేస్ బుక్ సీఈవో రిక్వెస్ట్..-General-Telugu-Telugu Tollywood Photo Image

దయచేసి అందరూ మాస్కులు ధరించండి.అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది దేశంలో ఆంక్షలు విధించకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా మాస్క్ ఎంతగానో సహాయం చేస్తుంది అంటూ ఫేస్ బుక్ సీఈఓ జుకర్బర్గ్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది.ఇక ఇప్పుడు వరకు అమెరికాలో ఇరవై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

#Facebook #Mask #Instagram Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ceo Mark Zucker Berg Request People Mask Related Telugu News,Photos/Pics,Images..