పసిపాప కు పాలు పడుతున్న కంపెనీ సీఈవో  

Heartwarming Photo Of A Father Feeding His Baby Daughter Goes Viral -

ఒక కంపెనీ సీఈవో అయివుండి ఒక పసిపాపకు పాలు పట్టడం ఏంటి అని అనుకుంటున్నారా.నిజంగానే ఒక కంపెనీ సీఈవో ఐన హర్బోలా అశుతోష్ నెలలు కూడా నిండని పసిపాపకు పాలు పడుతున్నారు.

Heartwarming Photo Of A Father Feeding His Baby Daughter Goes Viral

అయితే సమస్య ఏమో,ఇబ్బంది ఏమో తెలియదు కానీ తల్లి నిర్వర్తించాల్సిన భాద్యతలను సీఈవో హోదా లో ఉన్న ఆ వ్యక్తి నిర్వర్తిస్తున్నాడు.ఇప్పుడు దీనికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఈ ఫోటో వైరల్ గా మారింది.

మా సీఈవో హర్బోలా అశుతోష్.తండ్రిగా కూడా నిజమైన స్ఫూర్తితో పని చేస్తున్నారంటూ ఆయన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి ఈ ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

అంతే నిమిషంలో ఈ ఫోటో వైరల్ గా మారిపోవడమే కాకుండా అశుతోష్ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మరికొందరు నెటిజన్లు అయితే ఏకంగా అశుతోష్ పై ప్రశంశల వర్షం కురిపించేస్తున్నారు.అయితే ఇంతకీ అతడు ఎక్కడ ఉంటారు,ఏ కంపెనీ కి సీఈవో అన్న వివరాలు మాత్రం తెలియలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు