ఆధార్ పై ఇక ఆధారపడక్కర్లేదు ! ఎవరైనా అడిగితే కోటి రూపాయల జరిమానా ! ఇంకా...

ఆధార్.ఆధార్ ! ప్రభుత్వ … ప్రవేటు ఏదైనా పని అవ్వాలంటే… ఆధార్ కార్డు ఉండాల్సిందే.

 Centrel Government Sensational Desistion For Aadhar Card-TeluguStop.com

అసలు ఇప్పుడు ఏ చిన్న పని అవ్వాలన్నా … ఆధార్ కార్డే ఆధారం అవుతోంది.దీని వల్ల సామాన్య జనం చాలా ఇబ్బందికి గురవుతున్నా… ప్రభుత్వాలు మార్ట్రం ఈ ఆధార్ కార్డు అన్నిటికీ తప్పనిసరి చేసేసింది.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ఇకపై మీరు బ్యాంకులో ఖాతా తెరవడానికి వెళ్లినా, కొత్త సిమ్ కార్డు తీసుకునేందుకు వెళ్లినా, అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు ఇవ్వాలని ఎవరైనా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు.

కొన్ని ముఖ్య పథకాలకు తప్ప ఏ విషయంలో అయినా ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థపై రూ.కోటి జరిమానా విధించాలని, అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు చేపట్టిన చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అంతే కాదు కేవైసీ ఫార్మాలిటీస్ లో ఆధార్ తప్పని సరేమీ కాదని, దాని స్థానంలో ఇతర ఏ కార్డుల జిరాక్సులైనా సమర్పించ వచ్చని, ఆధార్ మాత్రమే కావాలని అడగటం నేరమని పేర్కొంది.కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలంటే, తమ తమ ప్రాంతాల్లో ఆధార్ ను తప్పనిసరి చేసుకునే వెసులుబాటును కల్పించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.ఆధార్ విషయంలో ప్రజలు అపోహలు పడుతున్నారని.

తమ డేటా లీక్ అవుతుందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంపై కేంద్రం కొంత కాలంగా సిరియస్ గా ఉన్న విషయం తెలిసిందే.

అయితే కేంద్ర నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని, మరే ఇతర సేవలకూ ఆధార్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశం తేల్చింది.ఇక ఆధార్ లోని వివరాలను ట్యాంపర్ చేసినా, ఎవరికైనా విక్రయించినా మరింత కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలు రూపొందించాలని న్యాయశాఖకు సూచించింది.అంతే కాదు ఆధార్ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పపడినా కఠిన శిక్ష అమలు అవుతుందని కేంద్రం పేర్కొంది.ఆధార్ డేటాను మిస్ యూజ్ చేస్తే రూ.50 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలుశిక్ష విధించేలా చట్ట సవరణకు ప్రతిపాదించింది.కాగా, ఈ నిర్ణయాలు పార్లమెంట్ ఆమోదం అనంతరం అమలు అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube