ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం స్పందన ఇదే !

ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నట్టు అప్పట్లో రాజకీయ పార్టీలు చాలా ఆశపడ్డాయి.కానీ ఇప్పటివరకు కేంద్రం ఆ విషయం మీద స్పందించలేదు.

 Centrel Governament Responce To Telangana Ap Asembly Seats-TeluguStop.com

ఆ అంశాన్ని నాన్చుతూ… వచ్చింది.ఈ లోపుగా తెలంగాణాలో ఎన్నికలు కూడా ముగిసిపోయాయి.తాజగా ఈ అంశం పై కేంద్రం స్పందించింది.ఇప్పట్లో… ఏపీ ,తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల పెంపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది.విభజన చట్టంలో సీట్ల సంఖ్య పెంచాలని పెట్టినప్పుడు రాజ్యాంగం ప్రకారం 2026లోనే సీట్లను పెంచడం సాధ్యం అవుతుందని కేంద్రం తెలిపింది.

ఎపిలో 175 సీట్లను 225 సీట్లకు, తెలంగాణలో 119 సీట్లను 153 సీట్లకు పెంచాలని అప్పట్లో విభజన చట్టంలో పేర్కొన్నారు.దీని ప్రకారంగానే….తెలంగాణ, ఏపీలలో అధికార పార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి.

అయితే కేంద్రం దీనిపై అటార్నీజనరల్ అభిప్రాయం కోరగా, రాజ్యాంగం ప్రకారం కొత్త జనాబా లెక్కల ప్రకారమే సీట్లను పెంచవలసి ఉంటుందని తేల్చేశారు.దీని ప్రకారం… 2026లోనే నియోకవర్గాల పెంపుదల ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube