రాష్ట్రాలకు మరో 47 లక్షల వాక్సిన్ డోసులు..!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో కేంద్రం వ్యాక్సినేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.జూన్ 21 నుండి అందరికి ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

 Centre Will Plan To Give 47 Lakhs Covid Vaccine Doses-TeluguStop.com

అయితే రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ డోస్ లను అందించే పనిలో కేంద్రం ఉంది.ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 1.05 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.రాబోయే మూడు రోజుల్లో మరో 47 లక్షల డోసులను రాష్ట్రాలకు పంపుతున్నట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు కేంద్రం నుండి రాష్ట్రాలకు పాతిక కోట్ల దాకా వ్యాక్సిన్ డోస్ లు అందినట్టు తెలుస్తుంది.మరో కోటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందించనుంది.

 Centre Will Plan To Give 47 Lakhs Covid Vaccine Doses-రాష్ట్రాలకు మరో 47 లక్షల వాక్సిన్ డోసులు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైరస్ ను పారద్రోలేందుకు రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుంది.రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ లను మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

ప్రస్తుతం కేంద్రం మూడవ దశ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ను కొనసాగిస్తుంది.ప్రతి నెలా సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ నుండి అనుమతించిన వ్యాక్సిన్లతో 50 శాతం తయారీదారుల నుండి భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

ప్రస్తుతానికి 47 లక్షలు రాష్ట్రాలకు అందించే ఏర్పాటు చేయగా త్వరలో మరిన్ని వ్యాక్సిన్ డోస్ లు రాష్ట్రాలకు అందిచేలా చూస్తుంది.

#CentralHealth #States #47 Lakhs #Covid Vaccine #Doses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు