బీజేపీ వ‌ల్ల న‌ష్ట‌పోతున్న తెలంగాణ.. టీఆర్ ఎస్‌కు ఇది క‌లిసొచ్చే అంశ‌మా..?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు తీవ్ర స్థాయిలో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.ఇప్ప‌టికే హుజూరాబాద్ వేదిక‌గా ఇరు పార్టీలు మీరు ఎంత చేశారంటే మీరు ఎంత చేశార‌ని ప్ర‌శ్నించుకుంటున్నారు.

 Centre Snubs Telangana Gave Railway Coach Factory To Maharashtra-TeluguStop.com

ఇలాంటి త‌రుణంలోనే బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం అస‌లు తెలంగాణ‌కు ఎలాంటి మేలు చేయ‌ట్లేద‌ని టీఆర్ ఎస్ ప‌దే ప‌దే చెబుతోంది.కాగా ఇప్పుడు మోడీ ప్ర‌భుత్వం చేసిన ప‌ని తెలంగాణాకు పెద్ద న‌ష్టం చేసింది.

తెలంగాణాలో చ‌ట్ట‌బ‌ద్ధంగా ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు రాష్ట్రానికి కాకుండా మహారాష్ట్ర కు సిఫ్ట్ చేశారు.

 Centre Snubs Telangana Gave Railway Coach Factory To Maharashtra-బీజేపీ వ‌ల్ల న‌ష్ట‌పోతున్న తెలంగాణ.. టీఆర్ ఎస్‌కు ఇది క‌లిసొచ్చే అంశ‌మా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అంద‌రూ కూడా బీజేపీ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.

ఇప్ప‌టికే మహారాష్ట్రలోని ఈ కోచ్ ఫ్యాక్టరీ పనులు మొద‌ల‌వ‌డం చాలా స్పీడ్ గా జ‌ర‌గుతున్నాయి.వాస్త‌వానికి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ అనేది రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు ద‌క్కాల్సి ఉంది.

అప్ప‌టి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ‌కు విభ‌జ‌న చ‌ట్టంలో భాగంగా దీన్ని మంజూరు చేసింది.కానీ అప్ప‌టి నుంచి ఇప్టి దాకా అంగుళం పని కూడా మొద‌ల‌వ‌లేదు.

కానీ 2018లో లాతూర్ ప్రాంతానికి కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీ ప‌నులు ఇ్ప‌టికే శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.

అస‌లు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్ర‌త్యేకంగా కోచ్ ఫ్యాక్టరీలు అక్క‌ర్లేద‌ని అప్ప‌ట్లోనే కేంద్రం చెప్పింది.కానీ ఆ త‌ర్వాత మాత్రం రైల్వేబోర్డు కోచ్ ఫ్యాక్టరీని మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించ‌డంపై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇక దీన్నే టీఆర్ ఎస అనుకూలంగా మ‌లుచుకునే ఛాన్స్ ఉంది.

బీజేపీ ఇస్తామ‌న్న దాన్ని ఇవ్వ‌కుండా ఉన్న దాన్ని కూడా ఇవ్వ‌కుండా వేరే రాష్ట్రానికి త‌ర‌లించిందంటూ వారు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ద‌క్కింది.దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్‌కు పెద్ద ఆయుధం దొరికిన‌ట్టు అయింది.

చూడాలి మ‌రి దీనిపై ఎన్ని రాజ‌కీయాలు వేడెక్కుతాయో.

#BJP Vs TRS #Telangana #Modi Govt #TelanganaRail #KCR About BJP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు