తెలంగాణాకి కోటా పెంచుతామంటున్న కేంద్రం..!

రాష్ట్రాల వారిగా కరోనా తీవ్రత తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాంఫరెన్స్ లో పాల్గొన్నారు.తెలంగాణాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు.

 Centre Incresing Vaccines Quota For Telangana-TeluguStop.com

తెలంగాణా నుండి మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కరోనా నియత్రణకు రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు హరీష్ రావు.

ఇటింటికి తిరిగి ఫీవర్ టెస్ట్ చేయిస్తున్నట్టు చెప్పారు.అవరం ఉన్న వారికి మందుల కిట్లు ఇస్తున్నట్టు తెలిపారు.

 Centre Incresing Vaccines Quota For Telangana-తెలంగాణాకి కోటా పెంచుతామంటున్న కేంద్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇతర రాష్ట్రాల నుండి హదరాబాద్ కు వస్తున్నారని చెప్పారు హరీష్ రావు.

ఈ క్రమంలో రాష్ట్రానికి కావాల్సిన రెమ్డెసివిర్, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లను పెంచుతామని హామీ ఇచ్చారు హర్షవర్ధన్.

తెలంగాణాకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆకిజన్ కోటాను ఇప్పుడు 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని హరీష్ రావు కోరారు.ఏపీ, మహారాష్ట్రల నుండి ఆక్సిజన్ కేటాయించాలని ఆయన చెప్పారు.

టోసిజుమాట్ ఇంజెక్షన్లు కోటా కూడా 810 నుండి 1500 వరకు పెంచాలని సూచించారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నామని ప్రస్తుతం రెండో డోస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు హరీష్ రావు.

తెలంగాణాలో బుధవారం నుండి జరుగుతున్న లాక్ డౌన్ గురించి కూడా కేంద్ర మంత్రితో చెప్పారు తెలంగాణా మంత్రి హరీష్ రావు.

#Remdesivir #Centre #Telangana #Incresing #Quota

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు